వైరల్ వీడియో: ఇది భారత్ పవర్!.. పాకిస్థాన్‌కు సినిమా చూపించిన భారత సైన్యం

Operation Sindoor: భారత సైన్యం ధైర్యసాహసాలను చాటిచెప్పిన 'ఆపరేషన్ సింధూర్' తాత్కాలికంగా నిలిచి నాలుగు నెలలు గడిచినా, దేశ ప్రజల మనసుల్లో సాయుధ దళాల పరాక్రమం ఇంకా పదిలంగా ఉంది. ఈ నమ్మకాన్ని మరింత పటిష్టం చేసేలా భారత సైన్యం ఇప్పుడు ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా శత్రు దేశాలకు ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన, కఠినమైన హెచ్చరికను పంపించింది.

వీడియోలో ఏముంది?
భారత సైన్యం నార్తర్న్ కమాండ్ విడుదల చేసిన ఈ వీడియో మూడు నిమిషాల నిడివితో ఆపరేషన్ సింధూర్ సమగ్ర దృశ్యాలను చూపిస్తుంది. ఇందులో పహల్గామ్ దాడికి ముందు పరిస్థితులు, ఆపరేషన్ లో ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన దాడులు, అలాగే పాకిస్థాన్‌కు భారత్ ఇచ్చిన గట్టి జవాబు వంటి కీలక ఘట్టాలు ఉన్నాయి. ఈ వీడియోలోని హై-క్వాలిటీ ఫుటేజ్, డ్రోన్లు, మిస్సైల్స్ దాడుల ఖచ్చితత్వం, భారత సాయుధ దళాల పోరాట సామర్థ్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.

Operation Sindoor Viral Video Indian Army Sends Strong Warning to Pakistan

వీడియోలో చూపిన దృశ్యాలు మాత్రమే కాకుండా.. వాటి మధ్యలో పొందుపరిచిన క్యాప్షన్లు కూడా ప్రత్యేక ఆకర్ణగా నిలిచాయి. 'ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది' అనేవి చెబుతూనే, 'ఉగ్రవాదం పూర్తిగా నాశనం అయ్యే వరకు భారత్ ఆగదు' అనే గట్టి సందేశాన్ని ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే దేశాలకు పంపించారు.

ఎందుకు ఈ సమయంలో వీడియోను విడుదల చేశారు?
రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వీడియో కేవలం గత విజయాన్ని గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే విడుదల చేయలేదు. దీని వెనుక ఒక వ్యూహాత్మక లక్ష్యం ఉంది. ఇండియా ఒక బాధ్యతాయుతమైన దేశంగా సంయమనం పాటిస్తుంది. కానీ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది.

ఆపరేషన్ సింధూర్ ను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, భారత నాయకత్వం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. భవిష్యత్తులో ఏదైనా ఉగ్రదాడి జరిగితే భారత్ ఈ ఆపరేషన్ ను మళ్లీ ప్రారంభిస్తుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలకు కూడా ఉగ్రవాదులకు ఇచ్చే శిక్షనే ఇస్తుందని ఈ వీడియో ద్వారా మరోసారి స్పష్టం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా ఓ సానుకూల పరిణామం. ఇది భారత సైన్యం ప్రణాళికాబద్ధంగా, ఆధునిక సాంకేతికతతో తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని శత్రు దేశాలకు మరోసారి గుర్తుచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+