పాకిస్థాన్ కు ఇవాళ నిద్ర లేని రాత్రే..!

దేశ రాజధాని దిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ, యూరోపియన్ నాయకులు, కేంద్రమంత్రులు, వీఐపీలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్ శకటం అందరినీ అబ్బుర పరిచింది. పాకిస్థాన్ పై గతేడాది మే 7-10 మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం వినియోగించిన ఆయుధాలను ప్రదర్శించింది. యుద్ధ సమయంలో ప్రయోగించిన ఆయుధాలు, నిఘా వ్యవస్థలు, బలగాలు ఈ శకటంలో కనువిందు చేశాయి. త్రివిధ దళాల సమన్వయంతో భారత్ శక్తి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రదర్శింపబడిందని శకటం రూపంలో కనిపించింది.

ఆపరేషన్ సింధూర్ కు డెడికేట్ చేస్తూ రెండు రఫేల్ ఫైటర్ జెట్స్, రెండు సుఖోయ్ ఎస్ యూ- 30 ఎంకేఐ ఎయిర్ క్రాఫ్ట్, రెండు మిగ్-29 ఎస్ అలాగే జాగ్వార్ లను ప్రదర్శించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఆపరేషన్ సింధూర్ సమయంలో వినియోగించినవే కావడం గమనార్హం. వాటిని తాజాగా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రదర్శించారు. ఈ విధంగా పాకిస్థాన్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరోక్షంగా దృఢమైన సందేశం ఇచ్చినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సాహసాలు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పకనే చెప్పింది భారత్.

operationsindoor Shines India s Tri-Services Tableau at Republic Day 2026 Leaves Pakistan Shaken

ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ప్రదర్శన వివరాలను పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాధించిన విజయాలను, ఐఏఎఫ్ పాత్రను వివరించింది. ఇక మే 7 నుంచి 10 వరకు నాలుగు రోజులపాటు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత్- పాకిస్థాన్ మధ్య భారీగా డ్రోన్ లు, అన్ మానెడ్ ఏరియల్ వెహికల్స్(UAVs) విధ్వంసం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ దే పైచేయిగా నిలిచింది. ఇదే విషయాన్ని తాజాగా ఓ స్విస్ థింక్ థాంక్ సంస్థ కూడా తన ప్రచురణలో పేర్కొంది. భారత వైమానిక దళం దెబ్బకు సీజ్ ఫైర్ అంటూ పాకిస్థాన్ మోకరిల్లిందని అందులో వివరించింది.

మరోవైపు ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారి డీఆర్‌డీఓ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. మాక్ 10 వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్, లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ నమూనాలు తొలిసారి వీక్షకుల ముందుకు వచ్చాయి. భారత్ హైపర్‌సోనిక్ టెక్నాలజీలోకి అడుగుపెట్టిందన్న సంకేతాన్ని ఈ ప్రదర్శన స్పష్టంగా ఇచ్చింది. అలాగే 29 విమానాలతో జరిగిన ఫ్లై పాస్ట్ మరో ప్రత్యేకతగా నిలిచింది. రఫేల్, సుఖోయ్- 30 ఎంకేఐ, మిగ్- 29, జాగ్వార్‌, పీ-8 ఐ, సీ-295 లాంటి విమానాలు ఒకేసారి విన్యాసాలు చేపట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+