Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Opinion:హర్యానా అసెంబ్లీ పోరులో వినేష్ ఫోగట్ వర్సెస్ సైనా నెహ్వాల్..?

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సమయం మరో 40 రోజులు మాత్రమే ఉంది. దీంతో అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇక అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి ప్రధాన పార్టీలు. ఈ సారి ఎన్నికల్లో సీట్లను ఆశించే ఆశావహులు కూడా ఎక్కువయ్యారు.తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు క్రీడాకారులు పోటీచేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇటీవలి పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయిన రెజ్లర్ వినేష్ ఫోగట్, బ్యాడ్మింటన్ మాజీ స్టార్ సైనా నెహ్వాల్‌లు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా వినేష్ ఫోగట్

మరి కొన్ని రోజుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ సైనా నెహ్వాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సైనా నెహ్వాల్ బీజేపీ తీర్థం పుచ్చుకుంది. అంతేకాదు అప్పుడప్పుడు కమలం పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ మోదీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ మహిళా రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడ్డాక కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయ్యింది. వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధం అవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని కాంగ్రెస్ విమర్శించింది. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులపై గొంతెత్తి మాట్లాడినందుకే వినేష్ ఫోగట్‌‌కు ఎలాంటి సహాయం చేయలేదని మండిపడింది. అందులో అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు మాజీ ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో హర్యానాలోని రైతులు, ఫోగట్‌కు అండగా నిలిచారు. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫోగట్ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటోంది కాంగ్రెస్.

Opinion Vinesh Phogat vs Saina Nehwal A Potential Showdown in Haryana Assembly Polls

బీజేపీ నుంచి సైనా నెహ్వాల్..?

ఇక కాంగ్రెస్ తీరు ఇలా ఉంటే బీజేపీ కూడా ఫోగట్‌కు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఒలింపిక్స్‌లో ఫోగట్ పై అనర్హత వేటు పడటంతో న్యాయపోరాటం చేసేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రంగంలోకి దిగింది.. ఫోగట్ తరపున వాదనలు వినిపించేందుకు దేశంలోనే టాప్ లాయర్ అయిన హరీష్ సాల్వేను పారిస్‌కు పంపింది కేంద్ర ప్రభుత్వం.అదే సమయంలో సైనా నెహ్వాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్రీడలకు పెద్ద పీట వేశారంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు సదుపాయాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా మెరుగుపడిందని, క్రీడాకారులకు అన్ని వేళలా మోదీ సర్కార్ అండగా ఉందనే విషయాన్ని గుర్తుచేసింది.ఈ ఇంటర్వ్యూను MyGovIndia ఎక్స్‌ (ట్విటర్)పై ట్వీట్ చేసింది. దీంతో హర్యానా మూలాలున్న సైనా నెహ్వాల్‌ను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించే యోచనలో బీజేపీ ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే వినేష్ ఫోగట్‌కు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంతో అదే సమయంలో సైనా రంగంలోకి దిగి మోదీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించడంపై చర్చ జరుగుతోంది. సైనాతో బీజేపీనే అలా మాట్లాడించిందా అనే అనుమానాలను కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒలింపిక్ ఎపిసోడ్‌తో అత్యంత పాపులారిటీ పొందింది వినేష్ ఫోగట్. దీంతో వినేష్‌ ఒప్పుకుంటే కాంగ్రెస్ తమ పార్టీ నుంచి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉంది. ఇదే జరిగితే సైనా నెహ్వాల్‌ను కూడా బీజేపీ బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వినేష్ ఫోగట్ వర్సెస్‌ సైనా నెహ్వాల్‌గా మారుతాయా లేదా అనేది తెలియాలంటే టికెట్ కేటాయింపుల వరకు వేచిచూడక తప్పదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+