అభిజీత్ దిప్కే, నేహా బోరాల నిర్బంధంపై విపక్షాల ఫైర్..! ఎవరేమన్నారంటే..!

ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు చేపట్టిన తిరంగా ర్యాలీకి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో (Abhijeet Dipke) పాటు అఖిల భారత విద్యార్ధి సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు నేహా బోరాను (Neha Bora) పోలీసులు వేర్వేరు చోట్ల నిర్బంధించారు. అనంతరం వారిని అజ్ఞాత ప్రదేశాలకు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు విధించకపోయినా, తిరంగా ర్యాలీని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఇవాళ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ నిర్బంధాలపై విపక్ష నేతలంతా (Opposition) ఫైర్ అవుతున్నారు.

అభిజీత్ దిప్కే, నేహా బోరా ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. వారిని ఎక్కడ ఉంచారో వెల్లడించకుండా నిర్బంధించడం పూర్తిగా చట్టవిరుద్ధం, అత్యంత అమానవీయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిని వెంటనే విడుదల చేయాలని, శాంతియుత నిరసనలను అణచివేయడం ఆపాలని కోరారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి చేసే ప్రతి ప్రయత్నం, దానిని మరింత బలపడేలా మాత్రమే చేస్తుందన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వేరే మార్గం లేదని స్టాలిన్ తేల్చిచెప్పారు.

Opposition Including Mamata Kejriwal and Stalin Condemn Detention of Abhijeet Dipke Neha Bora

అభిజీత్ దిప్కే అరెస్టుపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కూడా ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా నియంతృత్వమే అన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరమా? అభిజీత్‌ను అరెస్టు చేయడం చూస్తుంటే, మోదీజీకి వారి పట్ల ఎంత భయం ఉందో అర్థమవుతోందన్నారు. మన దేశంలోనే మనం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకపోతే, మరి పాకిస్థాన్‌లో ఎగురవేస్తామా? అని ప్రశ్నించారు. భారతీయ త్రివర్ణ పతాకం అంటే అభ్యంతరం ఉన్నవారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవచ్చన్నారు. మరోవైపు యూట్యూబర్ ధృవ్ రాఠీ కూడా దిప్కే అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పట్ల తనకున్న ద్వేషం కారణంగా, నరేంద్ర మోదీ ఇప్పుడు భారత జెండాను కూడా ద్వేషించడం మొదలుపెట్టారని తెలిపారు. దేశద్రోహి నరేంద్ర మోదీ అన్నారు.భారత జెండాను ఊపినందుకు ప్రజలను నిర్బంధించి, వారిపై దాడి చేసే ప్రధానమంత్రి కేవలం దేశద్రోహి మాత్రమే కాగలడని ట్వీట్ లో పేర్కొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్నందుకు అభిజీత్ దీప్కేను నిర్బంధించారు, ఈ విషయాన్ని జీర్ణించుకోండి, స్వతంత్ర భారతదేశంలో, మన యువత తమ ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా వినియోగించుకుంటున్నందుకు నిర్బంధించబడుతున్నారు అంటూ దీదీ ట్వీట్ చేశారు. ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితికి ఏమాత్రం తక్కువ కాదన్నారు. అసమ్మతికి భయపడే ప్రభుత్వం ఇప్పుడు ఒక తరం మొత్తాన్ని భయపెట్టి మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తోందన్నారు.

Opposition Including Mamata Kejriwal and Stalin Condemn Detention of Abhijeet Dipke Neha Bora

ఇది తాను నియంత్రించలేని గొంతును సహించలేని ఫాసిస్ట్ పాలన యొక్క ప్రవర్తన అని ఆరోపించారు. అభిజీత్, అశుతోష్, సౌరవ్ - మీరు భారతదేశ యువత యొక్క ధైర్యానికి, మనస్సాక్షికి, ఆకాంక్షలకు ప్రతీకలన్నారు. ఒక తరం గొంతును అణచివేయడం ద్వారా మీరు వారి గొంతును మూగబోయేలా చేయలేరన్నారు. మీ దీదీ మీకు దృఢంగా అండగా నిలుస్తుంది, ఏ బెదిరింపు, ఏ నిర్బంధం, ఏ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేవన్నారు. మేల్కోండి, భారతదేశమా! ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మరియు అసమ్మతి హక్కు కోసం పోరాటం కొనసాగుతుందని ట్వీట్ లో దీదీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+