Parliament: విపక్షాల నిరసనతో దద్ధరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు..
సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై విపక్ష ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి రాజ్యసభ, లోక్ సభకు హాజరయ్యారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రతిపక్షాల భేటీకి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ప్రసున్ బెనర్జీ, జవ్హార్ సిర్కర్ వచ్చారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్షాలు కలిసి రావాలని కోరారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉదయం విపక్షాల నేతలు ఖర్గే ఆఫీస్ వద్దకు వచ్చారు. సోనియా గాంధీతో పాటు విపక్ష ఎంపీలు బ్లాక్ షర్ట్ ధరించి పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు.

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై విచారణ జరిపేందుకు JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని కోరుతూ కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంటు కాంప్లెక్స్ నుంచి ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకు వైపు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నతృణమూల్ కాంగ్రెస్ నుంచి నేతలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications