అర్దరాత్రి అన్ని చీరలతో ఏం పని ?, తమాషా చేస్తున్నారా ?, మ్యాటర్ బయటకు లాగండి !
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరుతో పాటు కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు సోదాలు ముమ్మరం చేస్తున్నారు. రామనగరలోని ద్యావరసగౌడ దొడ్డి సమీపంలోని ఓ గోడౌన్‌లో జేడీఎస్ కార్యకర్తలు లక్షలాది రూపాయల విలువైన చీరలను గుర్తించి వాటిని అధికారులకు అప్పగించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
రామనగరలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులకు తెరలేపింది. రామనగరలోని ద్యావరసేగౌనదొడ్డి గ్రామ సమీపంలోని ఓ గోడౌన్ నుంచి లారీలోకి చీరలు లోడ్ చేస్తున్నారని తెలుసుకున్న జేడీఎస్ కార్యకర్తలు అర్థరాత్రి జేడీఎస్ ఆ అక్రమాలను గుర్తించి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే జేడీఎస్ కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకోవడంతో గోడౌన్ సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు.

లోక్ సభ ఎన్నికల సందర్బంగా రామనగరలోని ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ నేతలు లక్షలాది రూపాయల విలువైన వేల సంఖ్యలో చీరలు తీసుకు వచ్చి గౌడన్లలో నిల్వ చేశారని జేడీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. అనుమానాస్పదంగా చీరల బండిల్స్‌ను గోడౌన్ నుంచి బయటకు తీసి లారీలోకి లోడ్ చేస్తున్నారని, మేము దానిని ప్రశ్నించగా సరైన సమాధానం లేదని, వాటిని తనిఖీ చేయగా చీరల స్టాక్ దొరికిందని జేడీఎస్ కార్యకర్తలు, నాయకులు ఆరోపించారు.
లారీలో చీరల బండిల్స్ నింపుతున్నారని, ఆ సమయంలో రామనగర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కుమారుడి సహాయకుడు వసీం ఇన్‌ఛార్జ్ అని జేడీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. తనిఖీ చేసి చీరల స్టాక్‌ను గుర్తించిన వెంటనే ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ సహాయకుడు వసీం అక్కడి నుంచి పరారయ్యాడని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుందని జేడీఎస్ నాయకులు అంటున్నారు.
మేము ఇక్కడికి రాకముందే ఇక్కడి నుంచి నాలుగు లారీల చీరలను తరలించినట్లు సమాచారం ఉందని జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్భంగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రామనగర జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అవినాష్ మీనన్ రాజేంద్ర, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్తీక్ రెడ్డి ద్యావరసగౌడ దొడ్డి సమీపంలోని గోడౌన్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు.

అక్రమంగా నిల్వ ఉంచిన చీరల బండిల్స్ ఎవరికి సంబంధించినవి అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అక్రమ చీరల నిల్వ ఉన్న ప్రదేశంలో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల హైడ్రామా చోటుచేసుకుంది. గౌడన్ దగ్గర రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఉన్నారని జేడీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. చీర కవర్ మీద స్టిక్కర్ లేదని, వాటి మీద ఎవరి పేరు లేదని, గౌడన్ లో చీరలు ఉన్నాయని మా మీద నిందలు వేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ అంటున్నారు.
ఈ సమయంలో జేడీఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి విషమించిందని గ్రహించిన పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. వేల సంఖ్యలో చిక్కిన చీరలు ఎవరిరి అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో వేలింది. గౌడన్ లో ఉన్న చీరల బండిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులవే అని జేడీఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications