నిన్న పే సీఎం, పే పీఎం, నేడు పే సీఎస్, మ్యాటర్ ముదురుతోంది, వాళ్లతో !
బెంగళూరు/మండ్య: ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి అనే సిద్దాంతం ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది. ఎవరు అయితే మనల్ని ఏరకంగా దెబ్బ తీశారో అదే రీతిలో మనం కూడా దెబ్బ తియ్యాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ అవినీతిపై శక్తి వంచనలేకుండా ప్రచారం చేసి తరువాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ చుక్కలు చూపిస్తోంది.
కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ వాడిన అస్త్రాలే నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రివర్స్ గామారాయి. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న బసవరాజ్ బోమ్మయ్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన పే సీఎం ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు పే సీఎస్ ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు కర్ణాటకలో అధికారంలో ఉన్నన కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చింది.

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పే సీఎం 40 శాతం అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల ప్రచారం కూడా బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సహకరించింది. అంతే కాకుండా పే సీఎం నినాదం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంపముంచడమే కాకుండా పార్టీ ఓడిపోవడానికి కారణం అయ్యింది.

ఇప్పుడు మండ్యలోని బీజేపీ నాయకులు అక్కడి కాంగ్రెస్ పై పే సీఎం తరహాలో కాంగ్రెస్ పై పే సీఎస్ అంటూ ప్రచారం ప్రారంభించారు. కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చెలువరాయస్వామిపై పే సీఎం తరహాలో పే సీఎస్ ప్రచారం మొదలైంది. పే సీఎస్, మాకు పేటీఎం కూడా అందుబాటులో ఉంది అంటూ బీజేపీ సోషల్ మీడియాలో పోస్టర్లు వేసింది. పేటీఎం కోడ్ స్కాన్ చేసి లంచం ఇవ్వండి. ధన్యవాదాలు, ఇప్పుడు మీ అవినీతి మంత్రి చెలువరాయస్వామి అలియాస్ లంచ స్వామి అని ట్యాగ్ చేశారు.












Click it and Unblock the Notifications