అరెస్టైన మంత్రుల తొలగింపు బిల్లుకు షాక్-చించేసిన విపక్షాలు-జేపీసీ కోర్టులోకి ..!
దేశంలో ప్రధాని, సీఎంలు, మంత్రులు అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిగ్గా వారిని పదవుల నుంచి తొలగించేందుకు వీలుగా కేంద్రం ఇవాళ లోక్ సభలో బిల్లులు ప్రవేశపెట్టింది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. పార్లమెంట్ ఉభయసభల్లోనూ నిరసనలకు దిగాయి. వెంటనే ప్రభుత్వం బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లుల్ని చించేసి ఆయనపైనే విసిరేశాయి. ఈ పరిణామాలపై ఆత్మరక్షణలో పడ్డ కేంద్రం .. ఆయా బిల్లుల్ని జేపీసీకి పంపుతున్నట్లు ప్రకటించింది.
ఇవాళ లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా మొత్తం మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టారు.ఇందులో అరెస్టు అయిన మంత్రుల్ని పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్ధీకరణ బిల్లు ఉన్నాయి. దీంతో కోపోద్రిక్తులైన విపక్ష ఎంపీలు ఆయా బిల్లుల కాపీల్ని చించేసి హోంమంత్రి అమిత్ షాపైకి విసిరేశారు.

VIDEO | Parliament Monsoon Session: Opposition MPs tear copies of three bills introduced by Union Home Minister Amit Shah and throw paper bits towards him in Lok Sabha. Speaker Om Birla adjourns the House amid uproar. #ParliamentMonsoonSession #MonsoonSession
— Press Trust of India (@PTI_News) August 20, 2025
(Source: Third… pic.twitter.com/aAY12oBIFV
ఇందులో అరెస్టు అయిన మంత్రుల్ని పదవుల నుంచి తొలగించే బిల్లును క్రూరమైనదిగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. మంత్రులు మరియు ముఖ్యమంత్రులను ఏకపక్షంగా అరెస్టు చేయడం ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను అస్థిరపరిచేందుకు కేంద్రం దీన్ని వాడబోతోందని ఆరోపించాయి. ఆయా బిల్లులను పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని అమిత్ షా ప్రతిపాదిస్తుండగానే తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఇతర విపక్ష ఎంపీలు బిల్లుల కాపీలను చించి హోంమంత్రిపై విసిరారు. అయితే తాను బిల్లుల కాపీలు చించలేదని బెనర్జీ ఆ తర్వాత తెలిపారు.

కేంద్రం తెచ్చిన బిల్లు రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని, అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను అరెస్టు చేశారని, అప్పుడు ఆయన నైతికంగా వ్యవహరించారా అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోవాల్ ప్రశ్నించారు. దీనిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్టు కావడానికి ముందే గుజరాత్ మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు ఉన్నాయని, తాను విచారణలో ఉన్నంత వరకు నైతిక కారణాల వల్ల రాజీనామా చేశానన్నారు. కోర్టు తనను అన్ని ఆరోపణల నుండి విముక్తి చేసే వరకు ఒక్క రాజ్యాంగ పదవిని కూడా నిర్వహించలేదన్నారు
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications