ఎయిర్ ఫోర్స్‌కు విపక్షాల సెల్యూట్, రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో బీజేపీయేతర పక్షాలు బుధవారం భేటీ అయ్యాయి. దేశానికి అండగా ఉంటామని ప్రతిపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. త్వరలో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. పుల్వామా దాడిని 21 రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పుల్వామా ఘటనలో చనిపోయిన జవాన్లకు ప్రతిపక్షాలు శ్రద్ధాంజలి ఘటించాయి. మన ఆర్మీకి సెల్యూట్ చేస్తూ, ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విపక్షాలు ధ్వజమెత్తాయి.
భారత వైమానిక దళాల చర్యలను పార్టీ నేతలు అభినందించారు. వైమానిక దళాల ధైర్యసాహసాలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. భద్రతాదళాల త్యాగాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడాన్ని నేతలు ఖండించారు. పుల్వామా ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు చూస్తున్నారని చెప్పారు. సంకుచిత రాజకీయాల కోసం భద్రతను పణంగా పెట్టకూడదన్నారు. అఖిలపక్ష భేటీలో ప్రధాని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదన్నారు. ప్రస్తుత పరిణామాలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సార్వభౌమాధికార రక్షణలో జాతి అభిమతాన్ని పరిగణలోకి తీసుకోవాలని విపక్షాలు సూచించాయి.

తాము జవాన్ల వెంట ఉన్నామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారు. పుల్వామా ఉగ్రవాద దాడిని విపక్షాలన్ని ఖండించాయని చెప్పారు. మన వాయుసేన బలగాల చర్యల భేష్ అన్నారు. ఈ సందర్భంగా తప్పిపోయిన ఐఏఎప్ పైలట్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తమ పైలట్ విషయంలో అమానుషంగా ప్రవర్తించడాన్ని ఖండించారు. భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. సయ్యద్ హైదర్ షాకు ఈ సమన్లను జారీ చేసింది. పాక్ సైన్యానికి దొరికిన పైలట్ అభినందన్‌ను పాక్ ఆర్మీ హింసించింది. మిగ్ 21 కూలిపోయినప్పుడు ప్యారాచూట్ ద్వారా తప్పించుకున్న అభినందన్. అతను పాక్ ఆర్మీకి పట్టుబడ్డాడు.












Click it and Unblock the Notifications