పన్నీర్, పళని ఒకే కారులో అమ్మ సమాధి దగ్గరకు: సినిమా చూపిస్తా, శశికళల బ్రదర్ !
ఒకే కారులో పళనిసామి, పన్నీర్ సెల్వం జయలలిత, ఎంజీఆర్ సమాధి దగ్గర పూజలు ముందు ముందు సినిమా చూపిస్తా అంటున్న శశికళ బ్రదర్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వం, సీఎం ఎడప్పాడి పళనిసామితో కలిసి రాజ్ భవన్ నుంచి ఒకే కారులో నేరుగా మెరీనా బీచ్ చేరుకుని దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితకు సమాధుల వద్ద నివాళులు అర్పించారు.
పళనిసామి, పన్నీర్ సెల్వం వెంట తమిళనాడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లి అమ్మ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ తామందరూ అన్నదమ్ములని, కుటుంబం అన్న తరువాత చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు.

ఇంత కాలం తన మనసులో ఉన్న బాధ మొత్తం ఈ రోజుటితో వెళ్లిపోయిందని, అమ్మ జయలలిత ఆత్మ ఈ రోజు శాంతిస్తుతందని పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ సోదరుడు దివాకరన్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తన వెంట అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇక ముందు సినిమా చూపిస్తానని పరోక్షంగా పళనిసామి, పన్నీర్ సెల్వంను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications