శశికళకు అక్కడే చెక్: ఢిల్లీకి వెలుతున్న పళనిసామి, పన్నీర్ సెల్వం, అఫిడవిట్లతో వెనక్కి !
అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను శాశ్వతంగా తప్పించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాస్టర్ ప్లాన్ వేశారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను శాశ్వతంగా తప్పించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాస్టర్ ప్లాన్ వేశారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
శశికళను అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించామని దృవీకరిస్తూ గతంలో అన్నాడీఎంకే పార్టీ నేతలు భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు. శశికళను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఇచ్చిన అఫిడవిట్లను వెనక్కి తీసుకోవాలని సోమవారం నిర్ణయించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం స్వయంగా ఢిల్లీ చేరుకుని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శశికళకు మద్దతుగా ఇచ్చిన అఫిడవిట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. దినకరన్ దూకుడుకు ఈ విధంగా కట్టడి చెయ్యాలని ఇరువురు నేతలు సిద్దం అయ్యారు.
ముల్లును ముల్లుతోనే తీద్దాం అంటూ పన్నీర్ సెల్వం సోమవారం పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ శశికళ విషయంలో స్పంధించారు. భారత ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అధికారికంగా ఇచ్చిన అఫిడవిట్లను పళనిసామి, పన్నీర్ సెల్వం వెనక్కి తీసుకుంటే అన్నాడీఎంకే పార్టీ రాజకీయాలకు శశికళ శాశ్వతంగా దూరం కావాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications