కేంద్ర ఆర్డినెన్స్ చించిపారేయాలి: రాహుల్ ఘాటు వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేంద్రం ఆర్డినెన్స్ పైన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేర చరితులైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడకుండా ప్రభుత్వం తీసుకు వచ్చే ఆర్డినెన్స్ అర్థరహితమన్నారు.

ఇది పూర్తిగా నాన్సెస్ అని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి ఆర్డినెన్స్‌ను చించి అవతర పారేయాలని ధ్వజమెత్తారు. నేర చరిత్ర ఉన్న నేతలను రక్షించడానికి చేసిన అర్డినెన్స్ సమంజసం కాదన్నారు. ఇలాంటి రాజీపడే పద్ధతులను అన్ని పార్టీలు మార్చుకోవాలని సూచించారు.

Rahul Gandhi

ఆర్డినెన్స్ తేవాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. అవినీతిని నిజంగా అరికట్టాలనుకుంటే ఇలాంటి ఆర్డినెన్స్‌లను తేవడం సరికాదన్నారు. ఇది పనికిమాలిన ఆర్డినెన్స్ అన్నారు.

కాగా, నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అని ఇటీవల సుప్రీం కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకు వచ్చేందుకు సిద్ధపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+