వైరల్ వీడియో: ఛీ.. ఛీ.. అడ్డంగా దొరికిపోయిన లేడీ టీచర్..
పాఠాలు చెప్పాల్సిన టీచర్ పాడు పనులు చేసింది. నీతులు బోధించాల్సిన ఉపాధ్యాయురాలు పిల్లలతో నీచమైన పనులు చేపించింది. అక్షరాలు చెప్పాల్సిన స్థానంలో ఉండి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..?
తప్పొప్పుల మర్మం బోధించే గురువే తప్పుగా ప్రవర్తించింది. ఓనమాలు దిద్దించాల్సిన చిన్నారుల చేతులతోనే ఒంట్లో ఎక్కడెక్కడో తాకించుకుంటూ.. జుగుప్సాకరంగా ప్రవర్తించింది. అభం శుభం తెలియని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్.. వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచక బుద్ధిని ప్రదర్శించింది. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగింది.
அரூர் அருகே பள்ளி சிறுவர்களை கை கால்களை அமுக்கி விட சொல்லும் தலைமை ஆசிரியை.. வீடியோ வைரலானதால் பொதுமக்கள் அதிர்ச்சி... அரூர் மாவட்ட கல்வி அலுவலர் நேரில் விசாரணை #Trending | #viralvideo | #tnschool | #headmaster | #updatenews360 pic.twitter.com/DCM6bTsIcN
— UpdateNews360Tamil (@updatenewstamil) September 3, 2025
తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ స్కూల్ పిల్లల చేత తన కాళ్లకు మసాజ్ చేయించుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ పాఠశాలలో దాదాపు 30 మంది పిల్లలు ఉన్నారు. హెడ్ మాస్టర్ గా ఉన్న కలైవాణి తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పకుండా.. టేబుల్ పై పడుకుంది.

అదే సమయంలో తన కాళ్ళకు మసాజ్ చేయమని విద్యార్థులకు చెప్పింది. దీంతో చుట్టూ ఉంటే విద్యార్థులు ఆ లేడీ హెడ్ మాస్టర్ కాళ్లకు మసాజ్ చేశారు. దీంతో తమిళనాడు విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. గతంలోనూ ఓ టీచర్ కాళ్లకు మసాజ్ చేయించుకుంటే.. మరొక టీచర్ హెడ్ మసాజ్ చేయించుకున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.












Click it and Unblock the Notifications