డబుల్ డెక్కర్ బస్సు-ట్రక్కు ఢీ, 20 మృతి, 21 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘినోయ్ గ్రామం వద్ద డబుల్ డెక్కర్ బస్సును-ట్రక్కు ఢీ కొనడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రమాదంలో 20 మంచి చనిపోయారని, 21 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనౌజ్ జిల్లా గుర్సాగంజ్ నుంచి జైపూర్ వెళ్తుండగా జీటీ రోడ్డు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యం సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
బస్సు ప్రమాదానికి గురయ్యాక ప్రయాణికులు బయటకొచ్చే వీలులేకుండా పోయిందని తెలుస్తోంది. బస్సులో అప్పటికే ప్రయాణికులు నిద్రపోయారని.. తలుపు, కిటికీలు తెరుచుకోకపోవడంతో అందులోనే ఉండిపోయారని తెలుస్తోంది. డబుల్ డెక్కర్ బస్సు విమల్ బస్సు సర్వీసెస్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు.
Kannauj: A bus carrying 50 passengers catches fire after collision with a truck on GT Road. Fire tenders have rushed to the spot. More details awaited pic.twitter.com/aRdZC8ElhG
— ANI UP (@ANINewsUP) January 10, 2020
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications