వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాంటీ బయాటిక్స్ అతిగా వాడుతున్నారా? ఐసీఎంఆర్ హెచ్చరిక తెలిస్తే మీరు ఆ పని చెయ్యరు!!

|
Google Oneindia TeluguNews

మనదేశంలో యాంటీ బయోటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇబ్బడిముబ్బడిగా యాంటీబయాటిక్స్ ను వినియోగించడం వల్ల అవి ప్రభావవంతంగా పని చేయడం లేదని ఐసీఎంఆర్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యాంటిబయాటిక్స్ వినియోగానికి వ్యతిరేకంగా వైద్యులకు హెచ్చరిక జారీ చేసింది.

యధేచ్ఛగా యాంటీబయాటిక్స్ వినియోగించడం వల్ల మానవ శరీరంలో ఉండే వ్యాధికారక క్రిములలో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. దీంతో సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడం సవాల్ గా మారుతోంది అని హెచ్చరించింది. రోగులకు యాంటీబయాటిక్స్ ను సూచించేటప్పుడు వైద్యులు కచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముందు ఇన్ఫెక్షన్ ను గుర్తించడం కోసం క్లినికల్ డయాగ్నసిస్ చేపట్టాలని ఒకవేళ అవసరమైతేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని పేర్కొంది. క్లినికల్ డయాగ్నసిస్ ద్వారా సరైన యాంటీబయాటిక్స్ ను గుర్తించడానికి అవకాశం ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది.

Overusing Antibiotics? If you know the warning of ICMR you will not do that!!

దేశంలో యాంటీ బయోటిక్స్ వాడకం పై 2021 జనవరి 1 నుండి డిసెంబరు 31 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఐసిఎంఆర్ తాజా హెచ్చరిక చేసింది. 100.4 డిగ్రీల జ్వరం నుండి 102.2 డిగ్రీల వరకు జ్వరం ఉంటే యాంటీబయాటిక్స్ వినియోగం ఏమాత్రం మంచిది కాదని ఐసీఎమ్ఆర్ హెచ్చరించింది. అలాగే వైరల్ బ్రాంకైటిస్ కు కూడా వినియోగించే యాంటీబయాటిక్స్ విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులకు సూచించింది. అలసటగా ఉండటం, దగ్గు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, కొద్దిపాటి చలి జ్వరం వైరల్ బ్రాంకైటిస్ లక్షణాలని, ఇటువంటి కేసుల్లో సాధ్యమైనంత వరకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా ఉండాలని ఐసీఎంఆర్ పేర్కొంది. ఒకవేళ ఇవ్వదలచుకుంటే పేషెంట్ యొక్క హిస్టరీని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.

మన దేశంలో చాలా మంది రోగులకు అత్యంత శక్తివంతమైన కార్బాపినమ్ యాంటీబయాటిక్ ను ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదని, దీనికి బ్యాక్టీరియా త్వరగా లొంగడం లేదని, ఇందుకు కారణం విపరీతంగా చిన్న చిన్న రోగాలకు కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడమేనని ఐసీఎంఆర్ పేర్కొంది. మొత్తానికి ఐసీఎంఆర్ తాజా సర్వే తో విపరీతంగా యాంటీబయాటిక్స్ ను చిన్నచిన్న అనారోగ్యాలకు ఉపయోగిస్తే, అవి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో పని చేయబోవని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే యాంటీబయాటిక్స్ పట్ల అటు డాక్టర్లు ఇటు ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం, అధిక వినియోగాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది.

English summary
ICMR revealed that overuse of antibiotics increases the resistance of pathogens present in the human body. It has been suggested that doctors should strictly follow appropriate precautions while prescribing antibiotics to patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X