ట్రంప్ ఓ బ్రోకర్.. వాళ్లను వదిలిపెట్టొద్దు.. ఓవైసీ సంచలన ట్వీట్

భారత్- పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ ఉన్నా లేకున్నా ఉగ్రవాదుల ఏరివేతను భారత్ కొనసాగించాలని అన్నారు. పహల్గాం ఉగ్రవాదులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తో శాంతి సాధ్యం కాదు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా.. లేకున్నా.. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను విడిచే ప్రసక్తేలేదు. బయటి శక్తులు ఎప్పుడు భారత్ లోకి ప్రవేశించినా.. నేను భారత ప్రభుత్వానికి, ఆర్మీకి మద్దతుగా నిలుస్తూ వచ్చాను. ఇకపైనా మద్దతుగా ఉంటాను. యుద్ధ సమయంలో తెగువ చూపిన సైన్యానికి నా కృతజ్ఞతలు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు ఎం. మురళీ నాయక్, ఏడీడీసీ రాజ్ కుమార్ తపాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ఓవైసీ అన్నారు.

Owaisi Sparks Row Ceasefire or Not Terrorists Must Be Eliminated

ఈ సీజ్ ఫైర్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నా. గత రెండు వారాలుగా భారతీయులు, భారతీయ పార్టీలు ఒకటి గమనించాయని అనుకుంటున్నా. భారతీయులు ఐకమత్యంగా ఉంటే ఏం జరుగుతుందో చూపించాం. మనలోమనమే కొట్టుకుంటే శత్రువులకు చోటి ఇచ్చిన వాళ్లం అవుతాం.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. 1972లో జరిగిన షిమ్లా ఒప్పందం నుంచి చూస్తున్నాం.. మధ్యవర్తిత్వం ఎందుకు..? కాశ్మీర్ మన అంతర్గత సమస్య.. అంతర్జాతీయ సమస్య కాదు. ఇతర దేశాల మాటలు ఎందుకు వినాలి ? భారత్- పాకిస్థాన్ మధ్య చర్చలు వేరే దేశంలో ఎందుకు జరగాలి ? పాకిస్థాన్.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించదని అమెరికా హామీ ఇస్తుందా ? అని ఓవైసీ ప్రశ్నించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ బ్రోకర్ అని ఓవైసీ అన్నారు. పాకిస్థాన్ ను గ్రే లిస్ట్ లోకి పంపించేంత వరకూ భారత్ అంతర్జాతీయంగా పోరాడాలని ఓవైసీ సూచించారు. మరోవైపు పాకిస్థాన్ మరోసారి దొంగ దెబ్బ తీసింది. కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. అర్థరాత్రి జమ్మూలో మోటార్​ షెల్లింగ్​, డ్రోన్​ లతో వరుసగా నాలుగోరోజూ దాడులకు పాల్పడింది. నగ్రోటా వద్ద భారత్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ యత్నం చేసింది. అయితే చొరబాటుదారులపై భారత ఆర్మీ కాల్పులు జరిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+