కీలక సమావేశం: జనవరి 20 న, జరిగే మీటింగ్ లో నోరు విప్పేనా?
పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత ఏర్పడిన పరిణామాలపై ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనం వీడే సమయం ఆసన్నమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత ఏర్పడిన పరిణామాలపై ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనం వీడే సమయం ఆసన్నమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలపై చర్చించేందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ జనవరి 20 వ, తేదిన సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
పెద్ద నగదు నోట్ల రద్దు ను నల్లధనం నిర్మూలించే ఉద్దేశ్యంతో కేంద్రం నిషేధించింది. ఈ నేపథ్యంలో కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధానమంత్రి కోరిన యాభై రోజుల గడువు కూడ ముగిసింది.
పెద్ద నగదు నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో చోటుచేసుకొన్న పరిణామాలపై చర్చించేందుకుగాను పిఎసి సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ నెల 20వ, తేదిన ఈ సమావేశానికి హజరుకావాలని పిఎసి ఆర్ బి ఐ గవర్నర్ ను ఆహ్వనించింది.
యాభై రోజుల గడువు ముగిసిన తర్వాత కూడ ప్రజల కష్టాలు తీరలేదు. బ్యాంకులు, ఎటిఎం ల వద్ద ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే ప్రస్తావిస్తున్నారు.

ఉర్జిత్ పటేల్ నోరు విప్పుతారా?
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఏ రకమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయనే విషయాలపై పిఎసికి ఆర్ బి ఐ పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయనే వివరాలను ఆర్ బి ఐ పిఎసి సభ్యులకు వివరించనున్నారు. పెద్ద నగదు నోట్లను రద్దుచేసే సమయానికి దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి, రద్దు తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయాలపై పిఎసి చర్చించే అవకాశం ఉంది. పిఎసి సభ్యులు వ్యక్తం చేసే సందేహాలను ఆర్ బి ఐ తీర్చాల్సిన అవసరం ఉంది. దరిమిలా ఈ సమావేశంలో ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనాన్ని వీడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

ఆర్ బి ఐ ఇచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయాలు
పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో ఆర్ బి ఐ తీసుకొనే నిర్ణయాల ఆధారంగా పిఎసి నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు పిఎసి చైర్మెన్ థామస్ చెబుతున్నారు. పిఎసి సభ్యులు సందేహాలకు ఆర్ బి ఐ అధికారుల సమాధానాలను బట్టి ఒక అంచనాకు పిఎసి అధికారులు రానన్నారు. వీటి ఆధారంగా తాము భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేస్తామని పిఎసి సభ్యులు చెప్పారు.

సమగ్ర సమాచారంతో రావాలి
జనవరి 20వ, తేదిన జరిగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని పిఎసి చైర్మెన్ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నోట్ల రద్దు అంశంపై చర్చించనున్నారు. మరో వైపు రెవిన్యూతో పాటు ఇతర శాఖల అధికారులను కూడ సమావేశానికి రావాలని పిఎసి ఆదేశించింది. ఈ సమావేశంలో నోట్ల రద్దు పై సమగ్రంగా చర్చించనుంది.

బయటపడిన నల్లధనం ఎంత?
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా ఎంత నల్లధనం బయటపడిందో వివరించాలని ఆర్ బి ఐ ని పిఎసి కోరింది. ఈ మేరకు పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఎంత మొత్తాన్ని నల్లధనంగా గుర్తించారనే విషయాన్ని పిఎసికి వివరించనున్నారు ఆర్ బి ఐ అధికారులు.బ్యాంకుల్లో చేరకుండా ఉన్న నగదు ఎంత, బ్యాంకుల్లోకి చేరిన నగదు ఎంత అనే విషయాలను కూడ పిఎసి చర్చించనుంది.

రాజ్యసభ స్టాండింగ్ కమిటీ ఎదుట హజరైన ఆర్ బి ఐ అధికారులు
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలపై ఆర్ బి ఐ అధికారులను రాజ్యసభ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది.అయితే స్టాండింగ్ కౌన్సిల్ గుప్పించిన ప్రశ్నలకు ఆర్ బి ఐ నుండి సరైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది.రాజ్యసభ స్టాండింగ్ కమిటీ ఎదుట గత శుక్రవారం నాడుఆర్ బి ఐ అధికారులు హాజరయ్యారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications