చైనా సాయంతోనే పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన నిజాలు

జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్థాన్- భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో ఉన్నారు. పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Pahalgam Terror Attack Chinese Apps and Satellite Phones Used by Militants

పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఐదుగురు టెర్రరిస్టులు చైనాకు చెందిన ఫోన్లు, ఇతర సామాగ్రిని వాడినట్లు నిఘా వర్గాలు తేల్చేశాయి. ఉగ్రవాదులు చైనీస్ యాప్స్ ద్వారానే కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. ఈ మేరకు పహల్గాంలో ముష్కరులు కాల్పులు జరిపిన చోట చైనీస్ శాటిలైట్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో చైనా సాయంతోనే పాకిస్థాన్ ఉగ్రదాడి జరిపినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.

మరోవైపు భారత్- పాకిస్థాన్ వివాదంలో నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఇషాక్ దర్.. చైనాకు చెందిన తన కౌంటర్‌పార్ట్ వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. వీరిద్దరి మధ్య టెలఫోన్ కన్వర్జేషన్ సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలను వాంగ్ యీతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ కు భయపడి పాకిస్థాన్ అండకోసం చైనా వద్దకు వెళ్తోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీతో రాజ్​ నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించారు. పలు అంశాలపై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ కూడా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా వీరిద్దరి భేటీతో యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభం కావొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఇటీవల ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామన్నారు. ఇప్పటికే పాకిస్థాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకుని ఆ దేశాన్ని అష్టదిగ్భంధనం చేసింది భారత ప్రభుత్వం. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు, అధికారులు తగ్గింపు, సార్క్ దేశాల వీసా రద్దు, అటారీ-వాఘా బోర్డర్‌ మూసివేత, ఎక్స్‌ర్‌ సైజ్ ఆక్రమన్.. తదితర చర్యలు చేపట్టి పాకిస్థాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే పాకిస్థాన్ మాత్రం పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల చైనా సాయం కోరుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+