షాక్: బార్డర్ క్రాస్, పాక్ ఆధీనంలో మన జవాన్, మన సైనికుల్నీ చంపేశారా?
కరాచీ: యూరీ దాడికి భారత్ సర్జికల్ స్ట్రయిక్ ద్వారా పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాల్లో పాక్‌ను ఒంటరి చేసింది. ఐరాసలో పాక్ తీరును ఎండగట్టింది. సార్క్ దేశాల మద్దతును మోడీ ప్రభుత్వం కూడగట్టింది. ఆ తర్వాత బుధవారం రాత్రి సర్జికల్ స్ట్రయిక్ ద్వారా షాకిచ్చింది.
అయితే, పాకిస్తాన్ మీడియాలో షాకింగ్ వార్తలు వస్తున్నాయి. పాక్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. కనీసం ఎనిమిది నుంచి 14 మంది వరకు భారత సైనికులను పాకిస్తాన్ ఫోర్సెస్ హతమార్చాయి. సర్జికల్ స్ట్రయిక్‌కు ప్రతీకారంగా ఇది చేశాయని భావిస్తున్నారు. ఓ సెక్టార్‌లో ఎనిమిది, మరో సెక్టారులో ఆగురురు సైనికులను హతమార్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ వార్తలను భారత సైన్యం ఖండించింది.

పాక్ ఆధీనంలో జవాను
ఓ జవాను పాక్ సైన్యం ఆధీనంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతను పొరపాటుగా బార్డర్ దాటినట్లుగా తెలుస్తోంది. పాక్ ఆదీనంలో ఉన్న జవాను.. మహారాష్ట్రకు చెందిన చందు బాబులాల్ చౌహాన్‌గా చెబుతున్నారు. అతనిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంటున్నారు. మరో విషయమేమంటే 37 మంది రాష్ట్రీయ రైఫిల్స్ సోల్జర్స్‌ను పాకిస్తాన్ తమ ఆదీనంలోకి తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు
పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబావలేకు పాకిస్థాన్ సమన్లు జారీ చేసింది. పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆయనకు సమన్లు పంపింది.
జమ్ము కాశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనపై ఇటీవల భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు భారత విదేశాంగ శాఖ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. యూరీ ఘటనలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనే ఆధారాలను బాసిత్‌కు అందజేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications