వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత గగనతలంలోకి పాకిస్తాన్ హెలికాప్టర్, పేల్చేసే ప్రయత్నం చేసిన ఆర్మీ (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత గగనతలంలోకి పాకిస్తాన్‌కు చెందిన విమానం ఒకటి వచ్చింది. జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో ఈ విమానం కనిపించింది. భారత సైన్యం దానిని పేల్చివేసేందుకు ప్రయత్నాలు చేసింది. భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఎల్ఓసీలో పరిమిత పరిధిలోకి ఏ హెలికాప్టర్ రావొద్దు.

నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ హెలికాప్టర్ భారత భూభాగంలోని గగనతలంలోకి వచ్చింది. ఎల్ఓసీ దాటి కృష్ణ ఘటి సెక్టార్‌లోని గుల్పర్‌ ప్రాంతంలో మధ్యాహ్నం 12.13 నిమిషాలకు భారత గగన తలంలోకి అక్రమంగా ప్రవేశించిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు.

 Pak Helicopter Violates Indian Airspace, Army Tries To Shoot It Down

ఆ సమయంలో హెలికాప్టర్‌‌ వెళ్తున్న మార్గం వైపు భారత జవాన్లు కాల్పులు జరిపి పైలట్‌ను హెచ్చరించారని తెలిపారు. దీంతో విమానం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ వైపు తిరిగి వెళ్లిపోయిందన్నారు.

వీడియోలో పాకిస్తాన్‌కు చెందిన తెలుపు రంగు హెలికాప్టర్ పూంచ్ హిల్స్‌లో చక్కెర్లు కొడుతూ కనిపించింది. ఆ సమయంలో హెలికాప్టర్‌ను చిన్నపాటి కాల్పులతో హెచ్చరించారు. పెద్ద యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆయుధాలు ఉపయోగించలేదు.

గతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎల్వోసీ నుంచి 300 మీటర్ల దూరంలో ఓ పాకిస్తాన్ హెలికాప్టర్ కనిపించింది. ప్రస్తుత హెలికాప్టర్ దారి తప్పి మన భూభూగంలోకి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.

English summary
A Pakistani helicopter was seen flying in Indian airspace at Jammu and Kashmir's Poonch, following which the Army tried to shoot it down, people with direct knowledge of the matter said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X