కాశ్మీర్‌లో జిహాద్: ఆల్‌ఖైదా ఉగ్రవాదుల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం, కుట్రలో చేస్తోంది
న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో జిహాద్ అలజడులు సృష్టించాలని ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ఇచ్చిన పిలుపు వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ జిహాద్‌లో కాశ్మీర్‌ని చేర్చడం, చెచ్న్యా, జిన్జియాంగ్‌ని మినహాయించడం ఆల్ ఖైదా అరిష్ట ప్రకటనలో పాకిస్థాన్ హస్తాన్ని బహిర్గతం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు గురువారం పేర్కొన్నాయి.
తమ ఆధీనంలోకి తీసుకున్న ఆప్ఘనిస్థాన్ భూభాగాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకోనివ్వమని ఓ వైపు తాలిబన్లు ప్రకటిస్తుండగా.. కాశ్మీర్ విముక్తి కోసం ఉగ్రవాదులంతా ఏకమవ్వాలని పాకిస్థాన్ ఐఎస్ఐ రెచ్చగొడుతోందని తెలుస్తోంది. కాశ్మీర్ లోనూ ఇస్లాం రాజ్యం స్థాపించాలని ఉగ్రవాదులను రెచ్చగొడుతోంది పాకిస్థాన్.

ఈ విషయంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్.. ఆప్ఘాన్ తాలిబన్ల సాయాన్ని కోరిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థలకు, తాలిబన్లకు వారధిగా పాకిస్థాన్ ఐఎస్ఐ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్యాన్ని స్థాపించేందుకు గ్లోబల్ జిహాద్ పేరుతో ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్ కావాల్సినంత సాయం చేస్తూ ప్రపంచంలో అశాంతి వాతావరణం నెలకొనేందుకు కారణమవుతోంది.
మరోవైపు, తాలిబన్లకు ఇప్పటికే చైనా తన మద్దతును తెలియజేసిన విషయం తెలిసిందే. తాలిబన్లతో తమ స్నేహం కొనసాగుతుందని చైనా ప్రకటించింది. తాలిబన్లు ఆప్ఘాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇటీవల ప్రకటించారు. ఈ రెండు దేశాలు కూడా ఉగ్రవాదులకు మద్దతిస్తూ భారత్‌లో అశాంతికి కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలావుండగా, ఆప్ఘనిస్థాన్ తాలిబన్లతో భారత్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆప్ఘానిస్థాన్ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద కుట్రలకు వేదిక కారాదనే విషయాన్ని ఇటీవల తాలిబన్లతో చర్చల్లో ప్రధానంగా భారత్ లేవనెత్తింది. ఖతార్ రాజధాని దోహాలో ఈ భేటీ జరిగింది. అయితే, తదుపరి చర్చలపై ఎలాంటి సమాచారం లేదని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరందమ్ బాగ్చి తెలిపారు.
ఆప్ఘాన్‌లో మిగిలిన భారతీయుల తరలింపుపై ఆయన స్పందించారు. ప్రస్తుతం కాబూల్ అంతర్జాతీయ విమానం మూసివేశారని, ఎయిర్ పోర్టు నుంచి సేవలు పునర్ ప్రారంభమైన తర్వాత తరలింపు ప్రారంభిస్తామని తెలిపారు. ఆఫ్ఘాన్‌లో ఇంకా ఎంతమంది భారతీయులు ఉన్నారో ఖచ్చితంగా చెప్పడం కష్టమని అరిందమ్ బాగ్చి తెలిపారు.
కాగా, ఇటీవల తాలిబన్లతో చర్చల సందర్భంగా భారత్ కీలక అంశాలను ప్రస్తావించింది. ఆప్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించడంతోపాటు భారత్‌కు రావాలని కోరుకుంటున్న మైనార్టీల తరలింపు అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కాబూల్‌లో ఉగ్ర ఘటనలపై భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ఘాన్ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా, ఉగ్రవాదానికి తావులేకుండా చూడాలని భారత రాయబారి స్పష్టం చేశారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడంపై తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, ఆప్ఘనిస్థాన్‌లో తక్షణం చేపట్టాల్సిన విషయాలపై కేంద్రం దృష్టి సారించింది.
అమెరికా బలగాలు ఆప్ఘాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సభ్యులుగా ఉన్నారు. ఆప్ఘాన్ నుంచి భారతీయులు, మైనార్టీలను తీసుకొచ్చే అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇప్పటికే మెజార్టీ భారతీయులను స్వదేశానికి తరలించింది. మిగిలిన కొంత మంది భారతీయులు, మైనార్టీలను తరలించేందుకు కసరత్తులు చేస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications