అర్ధరాత్రి సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరిపిన పాక్-
India Pakistan War: పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగిన నేపథ్యంలో నియంత్రణ రేఖ పొడవునా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు మొత్తం కూడా భీకరంగా తయారయ్యాయి. పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం అన్నట్లు తయారయ్యాయి.
పూర్తిస్థాయిలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న కేంద్ర పాలిత ప్రాంతం ఇది. ఈ రెండు చోట్లే భారత ఆర్మీ బుధవారం తెల్లవారు జామున దాడులు సాగించింది. పాకిస్తాన్ భారీగా నష్టపోయింది కూడా ఇక్కడే. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై పదే పదే మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగుతోంది.

బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత ఆర్మీ పోస్టులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు పాకిస్తాన్ సైనికులు. కుప్వారా, బారాముల్లా, యూరీ, అఖ్నూర్ సెక్టార్ పరిధిలో నియంత్రణ రేఖ పొడవునా ఈ కాల్పలు జరిగినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీన్ని సరిహద్దు భద్రత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టినట్లు వివరించారు.
కిందటి నెల 22వ తేదీన పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి సంభవించిన మరుసటి రోజు నుంచే నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ వచ్చింది. ఈ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ భారత్ ఆరోఫించిన నేపథ్యంలో ఈ కాల్పులు మొదలయ్యాయి.
భారత్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత సైన్యం సహనానికీ పరీక్షలు పెడుతోంది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా హఠాత్తుగా కాల్పులకు దిగుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ కాల్పులు జరపడం ఇది 12వ సారి.
అంతముందు- జమ్మూ జిల్లా పర్గ్‌వాల్ సెక్టార్, రాజౌరి జిల్లాలోని సుందర్‌బనీ, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్ల పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై పాకిస్తాన్ ఈ కాల్పులు జరిపింది. దీన్ని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టారు. పాకిస్తాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పారు.
భారత- పాకిస్తాన్ 3,323 కిలో మీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోన్నాయి. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుండి జమ్మూలోని అఖ్నూర్ వరకు దాదాపు 2,400 కిలో మీటర్లు. జమ్మూ నుండి లఢక్ రాజధాని లేహ్ వరకు 740 కిలో మీటర్ల మేర నియంత్రణ రేఖ పంచుకుంటోంది. సియాచిన్ ప్రాంతంలో 110 కిలోమీటర్ల యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఉన్నాయి.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications