ఉగ్రవాది కుటుంబానికి రూ. 14 కోట్ల పరిహారం ప్రకటించిన పాక్ ప్రధాని.. మారర్రా మీరు
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్థాన్ మాత్రమే అనడానికి ఇదో ఉదాహరణ. పైకి టెర్రరిస్టులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బుకాయిస్తున్న పాకిస్థాన్.. లోలోపల మాత్రం వాళ్లు లేకపోతే కాళ్లు బయట పెట్టని పరిస్థితి. ఇప్పుడు పాకిస్థాన్ తన ఆర్మీ కన్నా ఉగ్రవాదులపైనే ఎక్కువ భారం వేస్తోంది. ఇలాంటి ఘటనలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతం అయినట్లు భారత రక్షణశాఖ పేర్కొంది. అయితే ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం కూడా హతం అయింది. ఆయన కుటుంబ సభ్యుల్లో 14 మంది హతం అయ్యారు. మసూద్ అజార్ సోదరి, బావమరుదులు, మేనల్లుడు సహా పది మంది కుటుంబసభ్యులు, మరో నలుగురు అతడి ముఖ్య అనుచరులు హతం అయ్యారు. దీంతో ఆ దేశ ప్రధాని షరీఫ్.. మసూద్ అజార్ కుటుంబానికి రూ.14 కోట్ల పరిహారం ప్రకటించారు.
అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్ లో భాగంగా బహవల్పూర్ నగరంలోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడిలో బిల్డింగ్ పూర్తిగా ధ్వంసం అయింది. బిల్డింగ్ పునరుద్ధరణతో పాటు మసూద్ అజార్ కుటుంబంలో మృతి చెందిన ఒక్కొక్కరికి ఒక్కో కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. అలా మొత్తం రూ.14 కోట్లు పరిహారంగా ప్రకటించారు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్.

మరోవైపు పాకిస్థాన్ ఎంతకు తెగించిందంటే.. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లోనూ పాల్గొంది. టెర్రరిస్టుల అంతిమయాత్రంలో పాక్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. వారి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంత్యక్రియల్లో లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్ ఫయాజ్ హుసేన్ షాతోపాటు పలువురు పాకిస్థాన్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ భూభాగంలోని మురీడ్కే లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం క్షిపణులతో దాడులు చేసింది. ఆ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.












Click it and Unblock the Notifications