వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొందూ దొందే! ఉగ్రవాదులను ఉసిగొలిపేది పాకిస్తాన్, వెనకుండి సాయం చేసేది చైనా!?

జమ్ముకశ్మీర్‌ల్లోకి ఉగ్రవాదులు చొరబడేలా పాకిస్తాన్ కిస్థాన్‌ ఉసిగొల్పుతోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా జైట్లీ వివరణ ఇచ్చారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ల్లోకి ఉగ్రవాదులు చొరబడేలా పాకిస్తాన్ ఉసిగొల్పుతోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. సరిహద్దుల వెంట ఉగ్రవాదులు తరచూ చొరబాట్లకు యత్నిస్తున్నారని.. వారిని భద్రతా బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఈ చొరబాట్లను అడ్డుకునేందుకు జరిపే కాల్పుల ఘటనల్లో ఎక్కువ మంది అవతలి వాళ్లే గాయపడుతున్నట్లు జైట్లీ తెలిపారు. లోక్‌సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా జైట్లీ వివరణ ఇచ్చారు.

యథేచ్చగా ఉల్లంఘన.. చొరబాట్లు

యథేచ్చగా ఉల్లంఘన.. చొరబాట్లు

‘భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్తాన్ కు చెందిన ముష్కరులు తీవ్రంగా యత్నిస్తున్నారు. వారిని బీఎస్‌ఎఫ్‌, ఆర్మీ సిబ్బంది ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది పాక్‌ ఎల్‌ఓసీ వెంబడి 285 సార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. గతేడాది పాక్‌ 228సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడగా, ఎనిమిది పౌరులు ప్రాణాలు కోల్పోయారు..' అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు సమీక్ష, చర్యలు...

ఎప్పటికప్పుడు సమీక్ష, చర్యలు...

సరిహద్దులో చొరబాటులను నియంత్రించేందుకు ఆర్మీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా అరుణ్ జైట్లీ తెలియజేశారు. రాడార్లు, ప్రత్యేక సెన్సార్ల ద్వారా చొరబాట్లను కనుగొని భగ్నం చేస్తున్నట్లు వెల్లడించారు. సరిహద్దులో భద్రత గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, తగిన చర్యలు తీసుకుంటుదన్నారు.

పీవోకేలో పాక్‌ డ్యామ్‌ ల నిర్మాణం...

పీవోకేలో పాక్‌ డ్యామ్‌ ల నిర్మాణం...

ఓ వైపు భారత్‌, చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు భారత్‌-పాక్‌ మధ్య శతృత్వాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పాక్‌కు చైనా పరోక్షంగా మద్దతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పీవోకేలో (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌) ఆరు డ్యామ్‌లను నిర్మించేందుకు పాకిస్తాన్ కు సాయం చేస్తోంది చైనా. పీవోకేలోని సింధూ నదిపై చైనా సాయంతో పాక్‌ ఆరు డ్యామ్‌లను నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ శుక్రవారం పార్లమెంట్‌లో వెల్లడించారు.

గతంలో ఒప్పుకున్నామంటూ...

గతంలో ఒప్పుకున్నామంటూ...

ఈ ప్రాజెక్టులను నిర్మించేందుకు మద్దతిస్తామని చైనా గతంలో ఒప్పుకుందని.. దీంతో ఇప్పుడు పాక్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపడుతోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. కశ్మీర్‌లోని భూభాగాలను పాక్‌ చట్టవిరుద్ధంగా ఆక్రమించడమేగాక, ఇప్పుడు భారత సార్వ‌భౌమ‌త్వాన్ని , ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఆసియాలోనే అతిపెద్ద నదుల్లో ఒకటైన సింధూ నది.. కైలాస పర్వతాల్లోని మానససరోవరంలో పుట్టింది. లడక్, గిల్గిత్‌-బాల్టిస్థాన్, ఖైబర్‌ పంఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ప్రవహించి.. పంజాబ్‌ గుండా అరేబియా సముద్రంలో కలుస్తోంది.

English summary
Pakistan has increased attempts to push terrorists into Jammu and Kashmir through the border but there is a high number of casualties on their side, Defence Minister Arun Jaitley said on Friday.Jaitley said in the Lok Sabha that the Indian Army has "domination and impact" along the western border and all steps have been taken to check infiltration from across the border. s"Pakistan has increased efforts of infiltration," he said during Question Hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X