షరీఫ్‍‌కు మోడీ 'ప్రత్యేక' కౌంటర్: బెలూచిస్తాన్‌లో 'జైహింద్'

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'బెలూచిస్తాన్' పైన చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజలు, నాయకులకు తియ్యగా కనిపిస్తే, పాకిస్తాన్ మీడియా మాత్రం ఆగ్రహం మోడీపై మండిపడుతోంది. కాశ్మీర్ ప్రజల ప్రత్యేక డిమాండుకు నవాజ్ షరీఫ్ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

కౌంటర్‌గా ప్రధాని మోడీ బెలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు మద్దతిస్తున్నట్లు 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా చెప్పారు. తద్వారా పాకిస్తాన్‌కు, షరీఫ్ వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు. మోడీ వ్యాఖ్యల పైన పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇది దెబ్బకు దెబ్బ అని కితాబిస్తన్నారు. మోడీ వ్యాఖ్యలు షరీఫ్ వ్యాఖ్యలకు కౌంటరే.

అయినప్పటికీ ప్రధాని మోడీ వ్యాఖ్యలు బలూచిస్థాన్ ప్రజల్లో గుండెల్లో తేనె జల్లులు కురిపించాయి. పాకిస్థాన్ పెడుతున్న క్షోభ నుంచి ఉపశమనం పొందుతామన్న ఆశ వారిలో కనిపిస్తోంది. మోడీ తన ప్రసంగంలో బెలూచిస్థాన్ గురించి ప్రస్తావించడంపై బెలూచ్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) నేత అష్రఫ్ షెర్జాన్ హర్షం వ్యక్తం చేశారు.

Pakistan invites self-exiled Balochistan leaders for talks

అంతేకాదు, భారతదేశం, బెలూచిస్తాన్ త్వరలోనే ఒకేసారి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాయన్నారు. మరో అడుగు ముందుకేసి 'జై హింద్' అంటూ నినదించారు. ఇది పాకిస్థాన్‌కు ఇబ్బంది కలిగించే పరిణామమే.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ బలూచిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు స్వాతంత్ర్యం కోసం బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ సమస్యలపై అంతర్జాతీయంగా చర్చ జరిగేలా చేశారు.

జూలై 21న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ ప్రజలు వీధుల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేస్తూ, తమకు స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. వారిపై పాకిస్థాన్ ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోంది.

గత ఏడాది వెలువడిన సమాచారం ప్రకారం పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీరు ప్రజలు బహిరంగంగానే భారత దేశంలో కలిసిపోవాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన తీరును ఇష్టపడుతున్నట్లు చెప్తున్నారు.

బీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహుండగ్ బుగ్టి ఆదివారం మాట్లాడుతూ.. అంతర్జాతీయ సమాజం లిబియా, సిరియాల్లో జోక్యం చేసుకోగలుగుతున్నపుడు, బెలూచిస్థాన్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదని ప్రశ్నించారు. బెలూచ్ ప్రజలు నిస్సహాయ స్థితిలో తమ స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారన్నారు. అయితే, పాకిస్తాన్ మీడియా మాత్రం మోడీ వ్యాఖ్యలపై మండిపడటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+