భారత బోటుపై పాక్ కాల్పులు: మత్స్యకారుడి మృతి
న్యూఢిల్లీ: గుజరాత్ తీరం వెంబడి అంతర్జాతీయ జలాల్లో ఉన్న భారత మత్స్యకారుల బోటుపై పాకిస్థాన్ తీర రక్షక దళం దాడి చేసింది. పాక్ దళం జరిపిన కాల్పుల్లో బోటులోని ఇక్బాల్ అనే భారతీయ మత్స్యకారుడు మరణించాడు.
ప్రేమ్‌రాజ్ అనే పేరున్న ఈ బోటు 8వ తేదీన ఐదుగురు మత్స్యకారులతో ఓఖా తీరం నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ బోటులో మరణించిన ఇక్బాల్ పోరుబందర్ పట్టణానికి చెందినవాడని అధికారులు తెలిపారు.
విషయం తెలుసుకున్న భారత కోస్ట్ గార్డ్ రెండు చిన్న షిప్ లను ఆ ప్రాంతానికి పంపింది. జరిగిన ఘటనపై విచారించడంతో పాటు, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్స్ మొదలు పెట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదుల హతం
జమ్మూకాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్ వద్ద భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళాలు అడ్డుకున్నాయి. గత రాత్రి నుంచి భారత సైనికులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సీనియర్ అధికారులు తెలిపారు. మరోవైపు పూంఛ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సైనికుడు గాయపడ్డాడు.
భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు
భారత హైకమిషనర్‌కు పాకిస్థాన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లఘించిందని.. ఈ కాల్పుల్లో తమ పౌరులు గాయపడ్డారని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications