భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..

భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తికాకముందే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. భవిష్యత్తులో యుద్ధం అంటూ వస్తే.. ఏకంగా భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కేరళలో జరిగిన ఒక ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 2025లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రస్తావించారు. కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్‌ను భారత్ మోకాళ్లపై నిలబెట్టిందని, ఉగ్రవాద స్థావరాలను మట్టికరిపించామని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ పొరుగుదేశం మళ్ళీ ఏదైనా సాహసానికి ఒడిగడితే, ఈసారి అంతకు మించిన 'అపూర్వమైన, నిర్ణయాత్మకమైన' చర్య ఉంటుందని ఆయన హెచ్చరించారు. అప్పట్లో ప్రాధేయపడి కాల్పుల విరమణ కోరుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోయి మళ్ళీ విర్రవీగుతుండటం గమనార్హం.

Pakistan Minister Khawaja Asif Warns India of Swift Response After Rajnath Singh s Tough Retort

పశ్చిమాసియా సాకుతో పాక్ కుతంత్రాలు..

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆసరాగా చేసుకుని, భారత్‌పై ఒత్తిడి పెంచాలని పాక్ భావిస్తోంది. అయితే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో పాక్ ఏ చిన్న తప్పు చేసినా, ఈసారి భారత్ ఇచ్చే బుద్ధి అపూర్వంగా ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 2025 నాటి 26 మంది జవాన్ల బలిదానాన్ని భారత్ మర్చిపోలేదని, ఏదైనా 'దుస్సాహసం' చేస్తే దాని పర్యవసానాలు ఊహాతీతంగా ఉంటాయని రాజ్‌నాథ్ హెచ్చరించారు.

హెచ్చరించిన ఖవాజా ఆసిఫ్..

పాక్ మంత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా, "రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధానికి తావులేదని భ్రమపడకండి.. మా స్పందన అత్యంత వేగంగా, కాలిబ్రేటెడ్ పద్ధతిలో ఉంటుంది" అని పేర్కొన్నారు. భారత్ చేస్తున్న వ్యాఖ్యలు వారిలోని 'వ్యూహాత్మక ఆందోళన'ను ప్రతిబింబిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగడం పాక్‌కు అలవాటే అయినప్పటికీ, ఈసారి నేరుగా సామాన్య పౌరుల ఇళ్లపైకి వస్తామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పహల్గామ్ వర్ధంతి వేళ, భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంది. పాక్ ఏ చిన్న తప్పు చేసినా 'ఆపరేషన్ సిందూర్' కంటే తీవ్రమైన దెబ్బ తగలడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+