పాక్ ప్రధానికి షాకిచ్చిన భారత్
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి పాక్ ప్రేరేపితమని తేలడంతో ఆ దేశంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది భారత్. తాజాగా, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్‌ను మనదేశంలో నిలిపివేసింది.
జాతీయ భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదంటూ ఓ సందేశం ఆ ఛానల్ క్లిక్ చేసినవారికి దర్శనమిస్తుండటం గమనార్హం. కాగా, పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ కేంద్రంా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు, సోషల్ మీడియా ఖాతాలను మనదేశంలో నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుున్న విషయం తెలిసిందే.

పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పలు ఛానళ్లపై భారత్ వేటు వేసింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది ఛానళ్లను కూడా నిలిపివేసింది. పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను కూడా బ్లాక్ చేసింది. తాజాగా, పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రీది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా సస్పెండ్ చేసింది.
పాకిస్థాన్ జావెలియన్ త్రోయర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ ఇన్‌స్టా ఖాతాను ఇప్పటికే బ్లాక్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చట్టపరమైన చర్యల్లో భాగంగా భారత్‌లో ఆ దేశానికి సంబంధించిన వారి ఖాతాలను నిలిపివేశారు. సింధూ నదీ జలాల నిలిపివేతతోపాటు పాక్ పౌరుల వీసాల రద్దు, పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత లాంటి కఠిన చర్యలను భారత్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఈ ఘటనకు కారణమైన పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలకు దిగింది. మరోవైపు, జమ్మూకాశ్మీర్ తోపాటు సరిహద్దులో ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి భారత భద్రతా దళాలు. సరిహద్దులో కాల్పులకు తెగబడిన పాక్ బలగాలకు ధీటుగా బదులిస్తున్నాయి. త్వరలోనే పాకిస్థాన్‌పై భారత్ భారీ చర్యకు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications