భారత్ మరో యుద్ధానికి సిద్ధం అవుతోంది: పాక్ అధ్యక్షుడి సంచలనం!

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారా స్థాయికి చేరుకొని భీకర సమరంగా మారిన వేళ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలే మూడో ప్రపంచ యుద్ధ భయంతో వణికిపోతున్న సమయంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధం అవుతుందని చెప్పి పాకిస్తాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ అధ్యక్షుడు

పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ భారత్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారతదేశం తమ దేశంతో మరో యుద్ధానికి రెడీ అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సింధూ జలాల ఒప్పందం రద్దు ప్రస్తావనలో, రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ నీటిని ఒక ఆయుధంలా వాడుకుంటోందని పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ విమర్శించారు. ప్రాంతీయ శాంతికి మద్దతుదారుగా తాను ఇటువంటి చర్యలను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.

Pakistan President Zardari Claims India Preparing for Another War Urges Talks to solve the problems

జమ్మూకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మేం రెడీ

యుద్ధ ఆలోచనలను వీడి చర్చలకు రావాలని భారత అధికారులకు పిలుపునిచ్చారు. ప్రాంతీయ భద్రతకు ఏ దేశానికైనా సరే శాంతి చర్చలే ఏకైక మార్గమని జర్దారీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అక్కడి ప్రజలకు అవసరమైన దౌత్యపరమైన సహాయాన్ని అందించడానికి పాకిస్థాన్‌ సిద్ధంగా ఉందని తెలిపారు.

ఆఫ్గనిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పాక్ అధ్యక్షుడు

ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కానంతవరకు, దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొనడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పాకిస్థాన్‌లో శాంతిని అస్థిరపరచడానికి అఫ్గానిస్తాన్ ప్రయత్నిస్తోందని, వీటిని అడ్డుకోవడానికి తమ దళాలు దీక్షగా కృషి చేస్తున్నాయని పాక్ అధ్యక్షుడు జర్దారీ వెల్లడించారు. ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ సమీకరించి ఆఫ్గనిస్తాన్ తాలిబన్లు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరాన్ ఇజ్రాయెల్ వార్ పై స్పందించిన పాక్ ప్రధాని

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణను కూడా పాక్ అధ్యక్షుడు జర్దారీ ఖండించారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్ దాడులను ఆయన ఖండించారు. యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం సరైన చర్య కాదని ఆయన హెచ్చరించారు. యుద్ధానికి బదులు శాంతి చర్చలతో పరిష్కారం చూసుకోవాలని ఆయన సూచించారు. భారత్ కు కూడా తాము అదే చెప్తున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+