కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్: కాశ్మీర్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
జమ్మూ: పాకిస్తాన్.. దారుణానికి తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల్లో అకారణంగా కాల్పులు జరిపింది. పేలుళ్లకూ దిగింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఒక్కసారిగా భారత్‌కు చెందిన సరిహద్దు భద్రత జవాన్ల పోస్టులపై దాడులకు పాల్పడింది.
ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు పొడవునా సైన్యం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సమాయాత్తమైంది. పాకిస్తాన్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బంకర్లకు తరలుతున్నారు.

జమ్మూ సమీపంలోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి 8 గంటలకు ఈ కాల్పులు మొదలయ్యాయి. పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ పోస్టులపై దాడులకు దిగినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. అర్ధరాత్రి దాటేంత వరకూ ఈ కాల్పులు కొనసాగినట్లు తెలిపారు.
#WATCH | Jammu and Kashmir: Visuals from RS Pura sector where an explosion is heard after Pak Rangers started unprovoked firing on BSF posts in Arnia area in violation of the ceasefire. https://t.co/wgZISa5VJ9 pic.twitter.com/DUz9QJKU6i
— ANI (@ANI) October 26, 2023
సుమారు మూడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఈ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ ఘటన తరువాత సరిహద్దు గ్రామాలను అప్రమత్తం చేశామని చెప్పారు.
#WATCH | Jammu and Kashmir: "...There was heavy firing. Everyone is scared. The people are hiding in bunkers..," says a local from Arnia. https://t.co/83CUPotu5R pic.twitter.com/P3ijbdscPq
— ANI (@ANI) October 27, 2023
కొన్ని చోట్ల పేలుళ్ల శబ్దాలు సైతం వినిపించినట్లు ఆర్నియా గ్రామస్తులు వెల్లడించారు. 2021 తరువాత మళ్లీ పాకిస్తాన్ ఆర్మీ.. బీఎస్ఎఫ్ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపిందని చెప్పారు. నివాసాలను వదిలి, బంకర్లకు తరలుతున్నామని పేర్కొన్నారు. భారీగా కాల్పులు- ఎదురుకాల్పులు సంభవించినట్లు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications