సుదర్శన చక్రం - పాక్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన భారత ఆర్మీ
India Pakistan War: పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి పాకిస్తాన్‌పై ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై బుధవారం తెల్లవారు జామున మిస్సైళ్లతో దాడి చేసింది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ దాడితో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలపై వేళ్లూనుకుపోయిన ఉగ్రవాద సంస్థలను నామరూపాల్లేకుండా చేసింది భారత్. జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు భారీగా నష్టపోయాయి. అవి నిర్వహిస్తోన్న శిబిరాలను 25 నిమిషాల్లోనే ధ్వంసం చేసి పడేసింది.

ఈ దాడుల్లో వంద మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చనీ తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ రెచ్చగొడితే తప్ప తదుపరి సైనిక చర్యలు ఉండవనీ అన్నారు. అటు ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు భారీగా నష్టం కలిగించినట్టయింది.
ఈ నష్టానికి అక్కడితో బ్రేకులు పడలేదు. పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్రంగా నష్టపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ ప్రయోగ కేంద్రం హెచ్ క్యూ 9 భారీగా దెబ్బతిన్నది. చైనా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్ ఈ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను అభివృద్ధి చేసుకుంది పాకిస్తాన్. లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఇవి. భూ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండేది ఇక్కడే.
శతృ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లను గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం, ఇంటర్‌సెప్ట్ కావడానికి హెచ్ క్యూ 9 మిస్సైల్ టెక్నాలజీని రూపొందించుకుంది. రాకెట్ లాంచర్లు, రాడార్, కమాండ్ సెంటర్ల వంటివి దెబ్బతింటే- దాని నష్టం అపారంగా ఉంటుంది. ఈ మిషన్‌లో డీప్ స్ట్రైక్ క్షిపణులను ఉపయోగించింది భారత్.
ఈ దాడితో ఎయిర్ డిఫెన్స్ విభాగంలో పాకిస్తాన్ సామర్థ్యం భారీగా క్షీణించినట్టయింది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ప్రాణనష్టం సంభవించినట్లు ప్రకటించుకుందే తప్ప ఆర్మీకి సంబంధించినంత వరకు జరిగిన నష్టంపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు.
Indian Air Force S-400 Sudarshan Chakra air defence missile systems were fired last night against targets moving towards India. The targets were successfully neutralised in the operation say multiple domain experts to ANI. Official Government confirmation awaited. https://t.co/MhPOyydK8X pic.twitter.com/qHo1tjukdF
— ANI (@ANI) May 8, 2025
వైమానిక దళం ఎస్- 400 సుదర్శన్ చక్ర వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి భారత్ వైపు దూసుకొస్తోన్న మిస్సైళ్లను అడ్డుకోగలిగింది. ఈ ఆపరేషన్‌లో టార్గెట్స్‌ను విజయవంతంగా న్యూట్రలైజ్ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. పాకిస్తాన్‌లో పలు ప్రదేశాల్లో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, దాని వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.
On the night of 07-08 May 2025, Pakistan attempted to engage a number of military targets in Northern and Western India including Awantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Jalandhar, Ludhiana, Adampur, Bhatinda, Chandigarh, Nal, Phalodi, Uttarlai, and Bhuj,… pic.twitter.com/x0KKDWzfoH
— ANI (@ANI) May 8, 2025












Click it and Unblock the Notifications