అదును చూసి దెబ్బకొట్టిన పాకిస్థాన్.. భారత్ కు భారీ నష్టం..!

గతేడాది ఇదే రోజున అంటే ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో భారత టూరిస్టులపై పాకిస్థాన్ ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాయి. 26 మందిని పొట్టనపెట్టుకున్నాయి. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7-10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. దాంతో పాటు పాకిస్థాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇరు దేశాల మధ్య ట్రావెల్, టూరిజం రద్దు చేసింది. ఎగుమతులు, దిగుమతులు రద్దు అయ్యాయి. అటారీ- వాఘా బోర్డర్ మూసివేశారు. ఇరు దేశాలు గగనతలం మూసివేశారు. అలాగే సింధూ నదీ జలాల ఒప్పందం కూడా పక్కనపెట్టింది భారత్.

ఇక భారత్ పైనా పాకిస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి భారత్ విమానాలు తమ గగనతలం వినియోగించుకోకుండా నిషేధం విధించింది. ఏడాది నుంచి ఈ నిషేధాన్ని అనేకసార్లు పొడిగిస్తూ వస్తోంది పాకిస్థాన్. తాజాగా మరోసారి ఆ గడువును పొడిగించింది. మే 24 వరకు భారత విమానాలు తమ గగనతలాన్ని ఉపయోగించుకోకుండా పాకిస్థాన్ తాజాగా నోటమ్ ఉత్తర్వులు జారీ చేసింది. నోటమ్ లో పేర్కొన్న విధంగా.." మే 24, 2026 ఉదయం 5 గంటల వరకు భారత్ లో రిజిస్టర్ అయిన, లీజుకు తీసుకున్న, వాణిజ్య అలాగే సైనిక విమానాలన్నీ పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉంటుంది" అని నోటమ్ లో పాకిస్థాన్ పేర్కొంది.

గతంలో ఇచ్చిన గడువు ఏప్రిల్ 24 న ముగియనున్న నేపథ్యంలో అందుకు కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ ఆ గడువును మరోసారి పొడిగించింది. మరోవైపు ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది కావొస్తున్న తరుణంలో భారత్ ను రెచ్చగొట్టే విధంగా పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది ఏప్రిల్ 24 న పాకిస్థాన్.. భారత్ కు గగనతలం మూసివేసింది. అయితే పాకిస్థాన్ నిర్ణయం కారణంగా భారత్ కు కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్ లోని పలు నగరాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకుంటోంది. 1999 కార్గిల్ యుద్దం, 2019 పుల్వామా సంక్షోభం సమయాల్లో కూడా పాకిస్థాన్ తన గగన తలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Pakistan Shocks India Amid West Asia Tensions Airspace Closed to India Flights Until May24 Big Loss

ఇక ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచదేశాలతోపాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+