గుజరాత్ దెబ్బకు.. దిక్కుతోచని స్థితిలో పాక్
అహ్మదాబాద్ : భారత్ పై పాక్ దుశ్చర్యలకు ఇప్పటికే సార్క్ లాంటి దౌత్య వేదికలపై పాక్ ను ఏకాకి చేసింది భారత్. తాజాగా కూరగాయల ఎగుమతి విషయంలో పాక్ కు భారత్ నుంచి కూరగాయలు పంపేది లేదంటోంది. ఈ నిర్ణయంతో గుజరాత్ రైతులకు ప్రతీరోజు రూ.3కోట్ల నష్టం వాటిల్లినా.. దేశ ప్రయోజనాల ముందు ఆ నష్టాన్ని లెక్కచేయబోమంటున్నారు అక్కడి అధికారులు, మరికొందరు రైతులు.
అసలు విషయానికొస్తే.. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ప్రతీరోజు 50ట్రక్కుల టమోటాలు, మిర్చి వాఘా సరిహద్దు ద్వారా పాక్ కు చేరుతాయి. తాజాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. పరిస్థితి గాడిన పడేవరకు పాక్ కు కూరగాయలు పంపేది లేదని అహ్మదాబాద్ జనరల్ కమిషన్ ఏజెంట్ల సంఘం ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. 1997నుంచి ఇప్పటిదాకా ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారి అని తెలిపారాయన.

గుజరాత్ నుంచి ఒక్కసారిగా కూరగాయల ఎగుమతులు ఆగిపోవడంతో.. పాక్ ప్రజానీకం అల్లాడిపోతుంది. నష్టాన్ని సైతం భరించయినా సరే పాక్ కు కూరగాయలు పంపేది లేదని గుజరాత్ లోని యశ్వంత్ పురాకు చెందిన గ్రామ సర్పంచ్ దశర్ పటేల్ తెలిపారు. పాక్ మినహా బంగ్లాదేశ్, కెనడా, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు యథావిధిగా కూరగాయలు ఎగుమతి చేస్తామని అహ్మద్ పటేల్ తెలియజేశారు.
పాక్ ఎక్కువ ధర చెల్లిస్తామంటూ ముందుకొచ్చినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోను కూరగాయలు పంపించేది లేదని గుజరాత్ రైతులు తేల్చి చెబుతున్నారు. దీంతో గుజరాత్ నిర్ణయానికి పాక్ దిక్కుతోచని స్థితిలో పడ్డట్టయింది.












Click it and Unblock the Notifications