పాకిస్థాన్‌కు భారీ ఎదురు దెబ్బ.. మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదే..!
భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కేఎస్‌ఈ 100 సూచీ ఏకంగా 7.2 శాతానికి పైగా పతనమైంది. దీంతో ఒక్కసారిగా ట్రేడింగ్‌ను నిలిపి వేయాల్సి వచ్చింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత నుంచే పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో నెలకున్నాయి. ఆ తర్వాత భారత్ చేపట్టిన సైనిక చర్యలు అక్కడి ఇన్వెస్టర్లను మరింత భయానికి గురిచేశాయి. ముఖ్యంగా మే 7న జరిగిన 'ఆపరేషన్ సిందూర్'లో భారత బలగాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది.

గత రెండు రోజుల్లోనే కేఎస్‌ఈ 100 సూచీ దాదాపు 9 శాతం నష్టపోయింది. దీంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌కు ఈ పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
మరోవైపు, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం ఈ పరిస్థితుల్లోనూ స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా భారత మార్కెట్లలో పెద్దగా ప్రభావం కనిపించకపోవడం విశేషం.












Click it and Unblock the Notifications