భారత్ ను భయపెట్టేందుకు పాకిస్థాన్ యుద్ధ సన్నాహాలు..! ఏకంగా ఆ మిసైల్ తో..?
భారత్ సరిహద్దు దేశమైన పాకిస్థాన్ కు భారత్ పై ఎప్పుడూ దాడులు చేయాలని ఉంటుంది. ఇప్పటికే భారత్ పై పాకిస్థాన్ ఉగ్రమూకలు అనేక సార్లు దాడులు చేశాయి. దాడులు జరిగిన ప్రతి సారీ భారత్.. ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెబుతూ వస్తోంది. అయినా కూడా ఎంత కొట్టినా చావని పాములా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. గతేడాది ఇదే రోజున ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ ఉగ్రదాడి చేపట్టింది. 26 మంది అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకుంది. అందుకు ప్రతీకారంగా మే 7-10 వరకు భారత్ ఆ దేశంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే వందలాదిమంది ఉగ్రమూకలను ఏరిపారేసింది. అలా పాకిస్థాన్ కు భారీ నష్టం కలిగించింది.
అయితే పహల్గామ్ ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ కావాలనే భారత్ ను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. తాజాగా అరేబియా సముద్రంలో పాకిస్థాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన తైమూర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని పాకిస్థాన్.. అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. 600 కిలోమీటర్ల దూరం నుండి శత్రు దేశాల నౌకలను అటాక్ చేయగల సామర్థ్యం ఉంది. ముఖ్యంగా భారత్ లోని ఐఎన్ఎస్ విక్రాంత్ లను లక్ష్యంగా చేసుకునేలా ఈ క్షిపణిని రూపొందించారు.
పాకిస్థాన్ స్వదేశీ టెక్నాలజీ 'తైమూర్' క్రూయిజ్ మిసైల్ ను రూపొందించింది. ఈ క్షిపణి అరేబియా సముద్రంలో భారత్ కు సవాల్ గా మారనుంది. ఈ క్షిపణి రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించే సాంకేతికతను 400 నుండి 450 కిలోల బరువున్న శక్తివంతమైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇది విధ్వంసక నౌకలను, ఫ్రిగేట్ లను ముంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్షిపణి తక్కువ శబ్దం కంటే ప్రయాణించినప్పటికీ, సముద్ర మట్టానికి కేవలం 152 మీటర్ల ఎత్తులో ప్రయాణించడం వల్ల దీనిని గుర్తించడం కష్టంగా ఉంది.

ప్రస్తుతం భారత్ వద్ద ఇతర విమాన వాహక నౌకలు, బరాక్ 8 వంటి అధునాతన రక్షణ వ్యవస్థలతో బలంగా ఉన్నప్పటికీ, తైమూర్ క్షిపణి.. భారత్ కు సవాల్ గా మారిందని చెప్పొచ్చు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది కావొస్తుంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని కాల్చి చంపారు టెర్రరిస్టులు. అందుకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications