బీ అలెర్ట్.. భారత్‌పై పాక్ హ్యాకర్ల దాడులు.. 10 లక్షల సైబర్ ఎటాక్స్!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇరు దేశాల సరిహద్దు వద్ద ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారత్ పై పాకిస్థాన్ హ్యాకర్ల దాడి ముంచుకొస్తోంది.
పిల్లలు, మాజీ సైనికులు, సంక్షేమ సేవలకు సంబంధించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాకిస్థాన్ హ్యాకర్లు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. అయితే దీనిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు వేగంగా స్పందించి.. నిర్వీర్యం చేశాయి. ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ వెబ్‌సైట్‌ను, భారత వైమానిక దళ మాజీ సైనికుల వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ లో 10 లక్షలకు పైగా సైబర్ దాడులు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ తెలిపారు. దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా లభించిన రెండు కీలక వీడియోల ఆధారంగా ఉగ్ర దాడిని ఎన్‌ఐఏ విశ్లేషిస్తోంది. జిప్ లైన్ ఆపరేటర్లను విచారణ చేస్తున్న ఎన్‌ఐఏ.. బైరసన్ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాట్రిడ్జ్‌లను గుర్తించింది. ఈ మేరకు విచారణను ముమ్మరం చేసింది.
ఇక ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications