దిల్లీ పేలుడు ఘటనపై పాకిస్థాన్ లో షాకింగ్ రియాక్షన్..?
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ పేలుడులో మృతి చెందినవారి సంఖ్య 12 కు చేరింది. పేలుడు జరిగినప్పుడు అక్కడికక్కడే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ముగ్గురు మృతి చెందారు. గాయపడ్డ మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక దిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు.దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. దాంతోపాటు దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, హైదరాబాద్, కోల్ కతా, చెన్నై తదితర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.
అయితే దిల్లీ పేలుడు ఘటనను పాకిస్థాన్ మీడియా విస్తృతంగా కవర్ చేసినట్లు స్పష్టం అవుతోంది. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానెళ్లు, వార్తాపత్రికలు అయిన డాన్, జియో న్యూస్, ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషన్, పాకిస్థాన్ టూడే.. తదితర వార్తాపత్రికలు ఈ వార్తను ఫ్రంట్ పేజీలో ప్రచురించాయి. వెబ్ సైట్లలోనూ విస్తృతంగా కవర్ చేశాయి. ఈ బ్లాస్టింగ్ ను భారత్ లోని యాంటీ- టెర్రర్ చట్టం కింద దర్యాప్తు చేస్తోందంటూ పేర్కొన్నాయి.
పాకిస్థాన్ కు ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక అయిన డాన్ లో .. దిల్లీ బ్లాస్ట్ ను యాంటీ- టెర్రరిజం చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్ వేసింది. టెర్రరిజాన్ని నిర్మూలించే చట్టం కింద న్యాయ విచారణ జరపనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారని డాన్ పత్రిక పేర్కొంది. ఫోరెన్సిక్ టీమ్ నమూనాలను సేకరించిన విచారిస్తోందని తెలిపింది. దాదాపు పదేళ్లలో దిల్లీలో జరిగిన అతిపెద్ద పేలుడుగా డాన్ పత్రిక అభివర్ణించింది. అంతకుముందు ఓ వార్త ప్రచురిస్తూ.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పరిస్థితిని సమీక్షించారని రాసుకొచ్చింది.
ఇక మరో ప్రముఖ వార్తా పత్రిక జియో న్యూస్ సైతం డాన్ పత్రిక మాదిరిగానే.. దిల్లీ పేలుడు ఘటనను యాంటీ- టెర్రరిజం చట్టం ప్రకారం విచారణ చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపింది. ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక.. దిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర మిస్టీరియస్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది.. 8 మంది మృతి చెందారు.. మరో 20 మందికి గాయాలయ్యాయి అని పేర్కొంది. న్యూస్ ఇంటర్నేషన్ పత్రిక, పాకిస్థాన్ టుడే పత్రిక సైతం ఇలానే కథనాలను ప్రచురించింది. ఈ క్రమంలో దిల్లీ పేలుడు ఘటనను పాకిస్థాన్ మీడియా విస్తృతంగా కవర్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

ఇక నవంబర్ 10 సోమవారం సాయంత్రం 6 గంటల 52 నిమిషాల సమయంలో ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్ కార్లలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. గేట్ నంబర్ వన్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇక ఇదే ఘటనపై తాజాగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కుట్రదారులను వదిలిపెట్టమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడినవారికి తగిన శిక్ష తప్పదని తెలిపారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిల్లీ పేలుడుపై ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం తన నివాసంలో ఈ సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications