వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాట మరో ఉద్యమానికి పిలుపునిస్తున్న యువత..

సోషల్ మీడియా వేదికగా జల్లికట్టు తరహా ఉద్యమానికి పిలుపునిస్తూ కొంతమంది నెటిజెన్స్ హల్ చల్ చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: వారానికి పైగా తమిళ పాలిటిక్స్‌లో కొనసాగిన హైడ్రామా పళనిస్వామి ప్రమాణస్వీకారం తర్వాత కాస్తంత సద్దుమణిగినట్టుగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా రెంటికి చెడ్డ రేవడిలా తయారైన పన్నీర్ సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందివచ్చిన అవకాశంలో ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడంలో విఫలమైన పన్నీర్ సెల్వం పరిస్థితి ఇప్పుడు పూర్తిగా చేయిదాటిపోయినట్టే.

Panneer selvam supporters calling for another movement in tamilnadu

ఇదిలా ఉంటే, పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పన్నీర్ వర్గం నుంచి కొంతమంది మద్దతుదారులు పక్కకు తప్పుకుంటుండగా మరికొంతమంది మాత్రం పోరాడేందుకు సిద్దమవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా జల్లికట్టు తరహా ఉద్యమానికి పిలుపునిస్తూ కొంతమంది నెటిజెన్స్ హల్ చల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పళనిస్వామికి వ్యతిరేక పోస్టులతో నెటిజెన్స్ హోరెత్తించారు. సీఎంగా పళనిస్వామి బలనిరూపణకు సిద్దమయ్యే నాటికి ఆందోళనను ఉధృతం చేయాలని భావిస్తున్నారు. కాగా, ఇదంతా పన్నీర్ సెల్వం కుట్ర అని అన్నాడీఎంకె వర్గాలు ఆరోపిస్తున్నాయి.

English summary
Panneer selvam supporters calling for another movement in tamilnadu. Especially in Social media several netizens were fighting against Palaniswamy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X