ఆత్మహత్యకు యత్నించిన పన్నీర్ మద్దతుదారులు.. పరిస్థితి విషమం
తాజాగా కొలత్తూరు, సేనిమావట్టమ్ లో పన్నీర్ మద్దతుదారులైన ఇద్దరు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. చివరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరారు.
చెన్నై: ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వంకు సీఎంగా అవకాశం లభించకపోవడంతో ఆయన మద్దతుదారులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. తాజాగా కొలత్తూరు, సేనిమావట్టమ్ లో పన్నీర్ మద్దతుదారులైన ఇద్దరు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. చివరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరారు.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కాగా, దాదాపు పదిరోజుల పాటు కొనసాగిన తమిళ పొలిటికల్ డ్రామా బుధవారంతో క్లైమాక్స్ కు చేరిన సంగతి తెలిసిందే. పన్నీర్-శశికళ వార్ ఇద్దరిని సీఎం రేసు నుంచి పక్కకు నెట్టేసి అనూహ్యంగా పళనిస్వామికి పట్టం కట్టే పరిణామాలను తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో తనకు 124మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెబుతూ సీఎం పీఠం అధిష్టించడానికి సిద్దమవుతున్నారు. గవర్నర్ సైతం ఈ సాయంత్రానికి ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇచ్చారు. దీంతో మొత్తం మీద పళనిస్వామి పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనమే కాగా.. ఇన్నాళ్లు కుర్చీ కోసం పోటీపడ్డ పన్నీర్ సెల్వంకు భంగపాటు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications