పన్నీర్ పంచ్, శశికళ ఫ్యామిలీకి చావు దెబ్బ: ఎవరీ స్వామినాథన్ కల్యాణసుందరం ? పక్కాస్కెచ్ !
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దెబ్బతోనే అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ పదవుల విషయంలో టీటీవీ దినకరన్ కు కళ్లెం పడిందని వెలుగు చూసింది.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దెబ్బతోనే అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ పదవుల విషయంలో టీటీవీ దినకరన్ కు కళ్లెం పడిందని వెలుగు చూసింది. పన్నీర్ సెల్వం నేరుగా తన పేరు బయటకు రాకుండా అన్ని వ్యవహారాలు చక్కదిద్దుతున్నారని తెలిసింది.
ఆగస్టు 5వ తేదీ చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వెలుతా, పార్టీ పగ్గాలు చేపడుతా, అందర్ని కంట్రోల్ లో పెడుతా అంటూ చంకలుగుద్దుకున్న టీటీవీ దినకరన్ కు ఆగస్టు 4వ తేది ఎన్నికల కమిషన్ పెద్ద షాక్ ఇచ్చింది.

ఇప్పుడు ఇదే విషయం చర్చ
ఆర్ టీఐ కార్యకర్త సమర్పించిన అర్జీకి భారత ఎన్నికల కమిషన్ సమాధానం ఇస్తూ టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి కాదని సమాధానం ఇచ్చింది. ఇప్పుడు తమిళనాడు ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది.
Recommended Video


టీటీవీ బండారం బయటపడింది
టీటీవీ దినకరన్ అసలు బండారం బయటపెట్టిన వ్యక్తి ఎవరూ అని చర్చ మొదలైయ్యింది. స్వామినాథన్ కల్యాణసుందరం అనే ఆర్ టీఐ కార్యకర్త భారత ఎన్నికల కమిషన్ ముందు టీటీవీ దినకరన్ విషయంపై వాస్తవాలు బయటకు తీసుకు వచ్చారని వెలుగు చూసింది.

ఎవరా స్వామినాథన్ ?
తమిళనాడులో ట్రాఫిక్ రామసామి అనే ప్రముఖ ఆర్ టీఐ కార్యకర్త ఉన్నారు. ఆయన్ను తమిళనాడులో ఎవ్వరికీ పరిచయం చెయ్యనవసరం లేదు. ఇప్పుడు స్వామినాథన్ కల్యాణసుందరం ఎవరూ అని కూపీలాగితే అసలు విషయం బయటకు వచ్చింది.

పన్నీర్ సెల్వం పక్కా ప్లాన్
అన్నాడీఎంకే పార్టీ తిరుగుబాటు నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకుడే స్వామినాథన్ కల్యాణసుందరం వని వెలుగు చూసింది. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే (పురచ్చి తలైవి) ఐటీ వింగ్ నాయకుడే స్వామినాథన్ కల్యాణసుందరం అని తెలిసింది.

శశికళ ఫ్యామిలీకి చావు దెబ్బ
పన్నీర్ సెల్వం పక్కా ప్లాన్ తో టీటీవీ దినకరన్ తో సహ శశికళను ఏకాకి చెయ్యాలని, పార్టీలో అతనికి ఏ పదవి లేదని తమిళనాడుతో సహ భారతదేశం మొత్తం తెలిసేలా చెయ్యాలని, శశికళ వర్గాని దెబ్బ కొట్టాలని పక్కా ప్లాన్ తో స్వామినాథన్ కల్యాణ సుందరంతో ఎన్నికల కమిషన్ అర్జీ సమర్పించి, టీటీవీ దినకరన్ డెడ్ లైన్ కు ఒక్క రోజు ముందు శశికళ వర్గాన్ని చావు దెబ్బకొట్టారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications