తాడో పేడో తేల్చుకుంటాం, మాఫియే చర్యే: పన్నీరు సెల్వం సంచలనం
యుద్ధం మొదలైంది.. తాడో పేడో తేల్చుకుంటామని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు. ప్రజాపక్షమే యుద్ధంలో గెలుస్తుందని చెప్పారు.
చెన్నై: యుద్ధం మొదలైంది.. తాడో పేడో తేల్చుకుంటామని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు. ప్రజాపక్షమే యుద్ధంలో గెలుస్తుందని చెప్పారు. అసెంబ్లీలో శనివారం ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణలో నెగ్గిన అనంతరం పన్నీరు సెల్వం
మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేశారని పన్నీరు సెల్వం ఆరోపంచారు. న్యాయం కోరితే దాడి చేశారని మండిప్డారు. సభలో ఎవరూ లేకుండా చేసి ఓటింగ్ నిర్వహించారని ఆరోపించారు. అన్యాయంగా కొట్టి, దుర్భాషలాడుతూ బయటికి పంపారని పన్నీరు చెప్పారు.

అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక శక్తులు ఇప్పుడు గెలిచినా.. చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు.
ప్రజలు కోరుకుంటున్నది ఇక్కడ జగరలేదని పన్నీరు సెల్వం చెప్పారు. శశికళ కుటుంబం ప్రభుత్వంలో జోక్యం చేసుకోకూడదని జయలలిత కోరుకున్నారని తెలిపారు. అసెంబ్లీలో జరిగిందంతా మాఫియాలో చర్యలో భాగమేనని పన్నీరు ఆరోపించారు. మున్నాళ్ల ముచ్చట కోసం దాడులు చేయడం సరికాదని అన్నారు. జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications