ఎంజీఆర్ నాణేలు విడుదల చేయాలి: పన్నీర్, శశికళ
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) స్మారక నాణేలు, ప్రత్యేక పోస్టల్ స్టాంప్ లు విడుదల చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నెచ్చెలి శశికళ శ
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) స్మారక నాణేలు, ప్రత్యేక పోస్టల్ స్టాంప్ లు విడుదల చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నెచ్చెలి శశికళ శుక్రవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు.
తమిళనాడు ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్ర మోడీకి పన్నీర్ సెల్వం, శశికళ వేర్వేరుగా లేఖలు రాశారు. పురత్చి తలైవర్ ఎంజీఆర్ తమిళ ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని గుర్తు చేశారు.

ఎంతో ఔదార్యం, దాతృత్వం ఉన్న వ్యక్తి అని, రాష్ట్ర చట్టపరమైన హక్కుల కోసం పోరాడే నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉండేవని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడు ప్రజల కోసం ఎంజీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు ఉందని, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా మోడల్ పథకాలుగా అమలు అవుతున్నాయని సీఎం పన్నీర్ సెల్వం తన లేఖలో వివరించారు.
నటుడిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉన్నత స్థాయికి ఎదిగారని, ఈనెల 17వ తేదీ ఎంజీఆర్ జయంతి ఉత్సవం సందర్బంగా నాణేలు, పోస్టల్ స్టాంపును విడుదల చెయ్యాడాన్ని తమిళనాడులోని అన్ని వర్గాల వారు స్వాగతిస్తారని పన్నీర్ సెల్వం నరేంద్ర మోడీకి మనవి చేశారు.












Click it and Unblock the Notifications