మనదేశంలో భూతల స్వర్గాన్ని తలపించే బెస్ట్ టూరిస్టు స్పాట్స్ ఇవే..

భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అనేక మతాల ప్రజలు నివసిస్తుంటారు. అనేక అచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు మనదేశం పెట్టింది పేరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు కేరళ నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు దేశవ్యాప్తంగా ఎన్నో పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఏడు రోజుల ట్రిప్ కు సరిగ్గా సరిపోయే టూరిస్టు ప్రాంతాలు ఇక్కడ చూద్దాం. మొదటగా రాజస్థాన్ పర్యాటకం.. రాజస్థాన్ లో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా జైపూర్, జోధ్ పూర్, ఉదయ్ పూర్ పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడి కోటలు, ప్యాలెస్ లు, పిచోలా సరస్సు చాలా ప్రత్యేకతను చాటుకుంటాయి.

ఇక కేరళ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుంటారు. కేరళలో కొచ్చి, మున్నార్, తెక్కడి, అలప్పుజ ప్రాంతాలు చాలా ఫేమస్. ముఖ్యంగా వేసవిలో కేరళ సందర్శనకు టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మున్నార్ లోని టీ తోటలు, తెక్కడిలోని వన్య ప్రాణుల అభయారణ్యం, అలాగే అలప్పుజ లోని బోటింగ్ మనసును ఆహ్లాదపరుస్తాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ ను భూతల స్వర్గధామం అని అంటారు. హిమాచల్ లోని మనాలీ, కసోల్, జిభి ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి పర్వతాలు, ప్రకృతి మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. సాహస క్రీడలు, ట్రెక్కింగ్, రివర్ సైడ్ కేప్ లు ఇక్కడ చాలా ఫేమస్.

Paradise on Earth Discover the Most Beautiful Tourist Spots in India That Will TakeYour Breath Away

ఇక అండమాన్ నికోబార్ దీవులు చాలా మందికి ఫేమస్ డెస్టినేషన్ గా ఉంటుంది. ఇక్కడ పోర్ట్ బ్లెయిర్, హేవలోక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ చాలా ఫేమస్. ఇక్కడ సముద్రంలో స్కూబా డైవింగ్, సెల్యూలార్ జైలు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలుగా ఉంటాయి. అలగే మేఘాలయా లో షిల్లాంగ్, చిరపుంజీ, మావ్లిన్నాంగ్- డావ్కి ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇక్కడి ప్రాంతాలు స్వర్గధామంలా ఉంటాయి. మరోవైపు లేహ్- లడక్ సాహస యాత్రకు నిత్యం వేలాదిమంది పర్యటకులు దేశ నలుమూలల నుంచి వెళ్తుంటారు. మీరూ ఈ ప్రాంతాలను ఈ వేసవిలో ట్రై చేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+