Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బతికుంటే ఏదో ఒకపని చేసుకోవచ్చు, స్కూల్ కు పంపిస్తే ప్రాణం పోతుంది !

బెంగళూరు: మణిపూర్ లో రిజర్వేషన్ల విషయంలో రెండు కులాల మధ్య జరుగుతున్న పోరాటం హింసకు దారి తీసి ఇప్పటికే వంద మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండు నెలల నుంచి మణిపూర్ లోని అనేక జిల్లాలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు తిరిగి తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే విద్యా సంస్థలు ప్రారంభం అయిన మరుసటి రోజు స్కూల్ సమీపంలో ఓ మహిళను కాల్చి చంపడంతో ప్రభుత్వం, విద్యార్థుల కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు.

రెండు నెలల తరువాత కూడా విద్యార్థులను స్కూల్ కు పంపించడానికి పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మణిపూర్ లోని ఇంపాల్ పశ్చిమ జిల్లాల్లో మొదటి రోజు పాఠశాలల్లో హాజరు శాతం అంతంతమాత్రంగా ఉండటం, కాల్పులు మోతలు నిలవకపోవడంతో పిల్లలు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

 Manipur

బతికుంటే ఏదో ఒక పని చేసుకుని బతకవచ్చని, పిల్లలను స్కూల్ పంపించి ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకోవాలని పిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది. పరిస్థితి సాదారణ స్థితికి వచ్చే వరకు పిల్లలను పాఠశాలలకు పంపించడానకి వాళ్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపించరని, పిల్లల ప్రాణాలకు మేము కూడా గ్యారెంటీ ఇవ్వలేమని ఇంపాల్ పశ్చిమ జిల్లాకు చెందిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రముఖ ఆంగ్ల పత్రికకు చెప్పారు.

ఇంపాల్ పశ్చిమ జిల్లాల్లో రెండు నెలలుగా మూతపడిన పాఠశాలలు బుధవారం తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో బుధవారం రాత్రి ఇంపాల్ కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని కాక్చింగ్ జిల్లాలో ఇద్దరు యువకులను ఆందోళనకారులు దారుణంగా హత్య చేసిన వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.

ఇద్దరు యువకులను చిత్రహింసలకు గురి చేసిన తరువాత వారిని దారుణంగా కాల్చి చంపి వారి శవాలను గొతిలోకి తోసేయడం ఆ వీడియోలో కనిపించడంతో అందరూ హడలిపోయారు. ఇదే సమయంలో హత్యకు గురైన యువకుల కులస్తులు సెక్ మైజిన్ బజార్ వంతెన వద్ద వందలాది మంది గుమికూడి నిరసన వ్యక్తం చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 Manipur

హత్యకు గురైన యువకుల శవాలను గుర్తించి ఆశవాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, పోలీసు అధికారులు సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కూడా మణిపూర్ లోని కాంగ్ పోక్సి జిల్లాలోని పలు గ్రామాల్లో తుపాకుల మోత వినిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. అల్లరిమూకలు కాల్పులు జరపకుండా ఆర్మీ బలగాలు వారిని అడ్డుకున్నారని స్థానిక మీడియా తెలిపింది.

 Manipur

ఇదే సమయంలో ఇంపాల్ కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో,ి చురచందాపూర్ లో సుమారు నాలుగు వేల మందికి పైగా కుకీ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించి మాకు న్యాయం చెయ్యాలని మణిపూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న అందరూ వారి ముఖాలు గుర్తు పట్టకుండా ముఖాలకు టవల్లు, వేల్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారని స్థానిక మీడియా తెలిపింది. మొత్తం మీద మణిపూర్ లో రెండు నెలల తరువాత స్కూల్స్ ప్రారంభం అయిన పిల్లలు మాత్రం బడులకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదని వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+