లోకసభలో అదే తీరు, వాయిదా: వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ సరికొత్త వ్యూహం
న్యూఢిల్లీ: పార్లమెంటులో మరో రోజు అదే తీరు. విపక్షాల ఆందోళనతో లోకసభ శుక్రవారానికి వాయిదా పడింది. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు, ఇతర విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో సభ వాయిదా పడింది.
Recommended Video

అనంతరం గంట తర్వాత అంటే పన్నెండు గంటలకు సభ ప్రారంభమైంది. అయినా సభ సజావుగా సాగలేదు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారుత. అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు ఏర్పాటు కోసం సభలో నిరసన తెలిపారు.

ఏకమైన పార్టీలు
పార్లమెంటులో ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయి. ఒక్కో అంశంపై ఒక్కో పార్టీ గురువారం పార్లమెంటు ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, టీడీపీ సహా అన్నా పార్టీలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల్లో వైసీపీ, అన్నాడీఎంకేలు లేవు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చారు.
సభలో టీడీపీ కొత్త వ్యూహం
పార్లమెంటులో టీడీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లనుంది. పార్లమెంటు నిరవధిక వాయిదా పడితే ఎంపీలంతా రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేయాలని వైసీపీ నిర్ణయించింది. దీనిపై టీడీపీ కొత్త ఎత్తు వేస్తోంది. శుక్రవారం సభ నిరవధిక వాయిదా పడితే రాత్రి వరకు సభ్యులు సభలోనే ఉండాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అలాగే వైసీపీ ఆమరణ దీక్షలకు టీడీపీ పోటీ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications