వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు సమావేశాలు: రఘురామ పై సస్పెన్షన్.. జలవివాదాలే ప్రధాన అంశాలుగా..!!

|
Google Oneindia TeluguNews

మరికాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి సమావేశాలు చాలా వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది కేంద్రం సాగు చట్టాలను తీసుకొచ్చింది. దీనిపై రైతులు నిరసనను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై చర్చ సాగే అవకాశం ఉంది. మరోవైపు రైతులు పార్లమెంటును ముట్టడించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంటు భవనం పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం

ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జలవివాదం అంశం హాట్ టాపిక్‌గా ఉంది. కృష్ణా,గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను ఆయా బోర్డులు ఇకపై సమీక్షిస్తాయంటూ గెజిట్‌లో చేర్చడం జరిగింది. ఇక ఇదే అంశంపై తెలంగాణ ఎంపీలు సభలో తమ నిరసనను తెలిపే అవకాశాలున్నాయి. ఇక రఘురామ కృష్ణం రాజును వెంటనే సస్పెండ్ చేయాలంటూ వైసీపీ ఎంపీలు సభలో నినాదాలు చేసే అవకాశం ఉంది.

Parliament monsoon sessions Live updates in telugu:Telugu states water dispute on cards

Newest First Oldest First
2:29 PM, 22 Jul

లోక్‌సభ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడగా.. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది
12:28 PM, 22 Jul

సభను అడ్డుకోవడాన్ని మేం తప్పుబడుతున్నాం.సభ సాగేందుకు సహకరించాలని మరోసారి సభ్యులను కోరుతున్నా:ప్రహ్లాద్ జోషి
12:28 PM, 22 Jul

ప్రతిపక్షాలు అనుసరిస్తోన్న విధానం పూర్తిగా తప్పు: ప్రహ్లాద్ జోషి
12:27 PM, 22 Jul

పదే పదే కేంద్రం అన్ని అంశాలపై చర్చ కు సిద్దమని చెప్పిన సభ సాగనివ్వకపోవడం సరికాదు:ప్రహ్లాద్ జోషి
12:27 PM, 22 Jul

లోక్ సభలో‌ కూడా అన్ని అంశాలపై చర్చిందేందుకు కేంద్రం సిద్దంగా ఉంది: ప్రహ్లాద్ జోషి
12:27 PM, 22 Jul

అందుకు తగ్గట్లుగా చర్చకూడా రాజ్య సభలో సాగింది: ప్రహ్లాద్ జోషి
12:26 PM, 22 Jul

కోవిడ్ పై ప్రతి పక్ష నేతలు చర్చ కోరారు
12:26 PM, 22 Jul

ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చిందేందుకు సిద్దంగా ఉంది:ప్రహ్లాద్ జోషి
12:24 PM, 22 Jul

సభ్యుల ఆందోళన పై లోక్ సభలో ప్రహ్లాద్ జోషి ఆగ్రహం
12:24 PM, 22 Jul

ఆందోళన మధ్యే సుమారు 15 నిమిషాలు కొనసాగిన లోక్ సభ ప్రొసిడింగ్స్
12:24 PM, 22 Jul

ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన నేతలు
12:24 PM, 22 Jul

స్పీకర్ పోడియం చుట్టూ ఆందోళన చేపట్టిన ప్రతిపక్షాలు
12:24 PM, 22 Jul

లోక్ సభ 2 గంటలకు వాయిదా.లోక్ సభలో కొనసాగిన విపక్షాల ఆందోళన
11:11 AM, 22 Jul

ప్రజల సమస్యలపై చర్చించాలి.. వెల్ దగ్గరకు దూసుకురావడం ఎందుకు.. దేశం మొత్తం సభను చూస్తోందన్న స్పీకర్ ఓంబిర్లా
11:10 AM, 22 Jul

లోక్‌సభలో కొనసాగుతోన్న నిరసనలు..
11:08 AM, 22 Jul

లోక్‌సభలో జలవివాదాలపై ప్రశ్నించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. సమాధానం చెప్పిన జల్‌శక్తి మంత్రి గజేందర్ షెకావత్
11:07 AM, 22 Jul

ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు. ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా
6:25 PM, 20 Jul

రాజకీయాలతో సంక్షోభం ఏర్పడకూడదు. 130 కోట్ల మంది ఒక అడుగు ముందుకు వేస్తే దేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళుతుందని ప్రధాని మోదీ చెప్పారు: ఆరోగ్యశాఖ మంత్రి
6:22 PM, 20 Jul

21 పార్టీల నుంచి 26 మంది ఎంపీలు కోవిడ్ పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఇప్పటికే కోవిడ్ థర్డ్ వేవ్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశ ప్రజలకు భరోసా కల్పించాలి. కరోనాపై పోరుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపాలి: ఛైర్మెన్ వెంకయ్యనాయుడు
6:17 PM, 20 Jul

పెగాసస్‌పై ఎవరూ స్పందించడం లేదు. కేంద్రహోంశాఖ మంత్రి తాము వాడలేదని కచ్చితంగా చెప్పడం లేదు. దేశ ప్రజలకు ఎంపీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నేత కపిల్ సిబల్
3:46 PM, 20 Jul

లాక్‌డౌన్‌కు ప్రభుత్వం ప్రిపేర్ అవ్వలేదు: రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే
10:34 AM, 20 Jul

రాజ్యసభలో పెగాసస్ పై చర్చించాలంటూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ కేసీ వేణుగోపాల్
10:33 AM, 20 Jul

పెగాసస్ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్
10:32 AM, 20 Jul

కోవిడ్ గురించి మాట్లాడాలనుకుంటే ప్రధాని మోదీ సెంట్రల్ హాల్‌లో ఎంపీలు అందరినీ సమావేశపర్చి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలోని కోవిడ్ పరిస్థితి వివరించే అవకాశం ఇవ్వాలి: మల్లికార్జున ఖర్గే
10:17 AM, 20 Jul

కోవిడ్-19 పై సభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
10:16 AM, 20 Jul

ఈ రోజు జరగబోయే సమావేశానికి ముందు భేటీ అయిన బీజేపీ పార్లమెంటరీ నేతలు
10:14 AM, 20 Jul

పెగాసస్ రచ్చపై రాజ్యసభలో ఒక స్టేట్‌మెంట్ చేయనున్న ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
10:12 AM, 20 Jul

మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండవ రోజు పార్లమెంటు సమావేశాలు
3:08 PM, 19 Jul

లోక్‌సభ మధ్యాహ్నం 3:30 గంటల వరకు వాయిదా
3:01 PM, 19 Jul

రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌‌గా కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
READ MORE

English summary
Parliament monsoon sessions to start on the 19th of July. This time many major issues may come up for discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X