వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Parliament RoundUp today: రావత్ సహా హెలికాఫ్టర్ మృతులకు నివాళి, విపక్షాల ఆందోళనకు బ్రేక్

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ కొనసాగుతున్నాయి. ఉదయం ఇరుసభలు ప్రారంభం కాగానే నిన్న హెలికాఫ్టర్ ఘటనలో మృతిచెందిన సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు మరో 12 మందికి నివాళులు అర్పించాయి. సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాయి. అలాగే రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిపై సుదీర్ఘ ప్రకటన కూడా చేశారు. బిపిన్ రావత్ మృతికి గౌరవ సూచికంగా విపక్షాలు ఇవాళ నిరసనలకు దూరంగా ఉన్నాయి.

పార్లమెంట్ ఉభయసభల్లోనూ బిపిన్ రావత్ ఘటనపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. "8 డిసెంబర్ 2021 మధ్యాహ్నం మిలిటరీ హెలికాప్టర్ కూలిపోయిందనే దురదృష్టకర వార్తను, భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు తీవ్ర దుఃఖంతో మరియు బరువెక్కిన హృదయంతో నేను తెలియజేస్తున్నాను. జనరల్ బిపిన్ రావత్ విద్యార్థి అధికారులతో సంభాషించడానికి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి షెడ్యూల్ సందర్శనలో ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ Mi-17V5 హెలికాప్టర్ నిన్న ఉదయం 11:48 గంటలకు సూలూర్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరింది మరియు మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్‌టన్‌లో ల్యాండ్ అవుతుంది."

in todays parliament session, both the houses have paid tribute to the deceased in army helicopter incident.

"సూలూరు ఎయిర్‌బేస్‌లోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు దాదాపు మధ్యాహ్నం 12:08 గంటలకు హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. తదనంతరం, కొంతమంది స్థానికులు కూనూర్ సమీపంలోని అడవిలో మంటలను గుర్తించి, మంటల్లో మునిగిపోయిన మిలిటరీ హెలికాప్టర్ శకలాలు గమనించిన ప్రదేశానికి చేరుకున్నారు. చుట్టుపక్కల స్థానిక యంత్రాంగం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ప్రాణాలతో బయటపడే ప్రయత్నం చేశారు. శిథిలాల నుంచి బయటపడిన వారందరినీ వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టకర హెలికాప్టర్‌లో ఉన్న మొత్తం 14 మందిలో 13 మంది గాయాలతో మరణించినట్లు తాజా నివేదికలు ధృవీకరించాయి."

"మృతుల్లో CDS భార్య శ్రీమతి మధులికా రావత్, అతని రక్షణ సలహాదారు బ్రిగ్ లఖ్‌బిందర్ సింగ్ లిద్దర్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ మరియు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు. వారి పేర్లు వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ అరక్కల్ ప్రదీప్, హవల్దార్ సత్పాల్ రాయ్, నాయక్ గుర్సేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు మరియు అతని ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి భారత వైమానిక దళం, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో ట్రై-సర్వీస్ విచారణకు ఆదేశించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పూర్తి సైనిక గౌరవాలతో దహనం చేస్తారు. నేను, గౌరవసభ తరపున, మరణించిన వ్యక్తులకు నివాళులర్పిస్తున్నాను మరియు మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను." అంటూ రాజ్ నాథ్ ప్రకటించారు.

మరోవైపు రాజ్యసభలో విపక్షాలు బిపిన్ రావత్ కు నివాళులు అర్పించడానికి ఛైర్మన్ వెంకయ్య సమయం ఇవ్వకపోవడంపై విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు లోక్ సభలో సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పెంపు కోసం ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరిగింది. మరోవైపు నాగాలాండ్ ఘటనపై గతంలో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలో సభను తప్పుదోవ పట్టించారని లోక్ సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు.

ఏపీకి సంబంధించి వైసీపీ రెబెల్ ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితిపై ప్రశ్న లేవనెత్తారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు చేపట్టకపోవడం అక్రమాలకు తావిస్తోందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అటు వైసీపీ ఎంపీ సత్యవతి విశాఖ రైల్వే జోన్ అంశాన్ని లేవనెత్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను గతంలో కేటాయించారని, ఇప్పుడు రైల్వే జోన్ పై కేంద్రం మాటమారుస్తోందని ఆరోపించారు. వెంటనే రైల్వే జోన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవాళ పార్లమెంట్ హైలెట్స్

- పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం

- బిపిన్ రావత్ సహా హెలికాఫ్టర్ మృతులకు ఉభయసభల నివాళి

-బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ఘటనపై ఉభయసభల్లో రక్షణమంత్రి రాజ్ నాథ్ ప్రకటన

- బిపిన్ రావత్ సహా 13 మంది మరణానికి కారణమైన హెలికాఫ్టర్ ఘటనపై త్రివిధ దళాలతో దర్యాప్తు

- బిపిన్ రావత్ కు గౌరవసూచికంగా రాజ్యసభలో నిరసనలకు విపక్షం విరామం

- లోక్ సభలో ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం పెంపు కోసం పెట్టిన బిల్లుపై చర్చ

- నాగాలాండ్ ఘటనపై అమిత్ షా సభను తప్పుదోవ పట్టించారని లోక్ సభ విపక్ష నేత అధిర్ చౌదరి ఆరోపణ

English summary
in today's parliament session, both the houses have paid tribute to the deceased in army helicopter incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X