కొలువుదీరిన 17వ లోక్‌సభ.. ప్రమాణస్వీకార సమయంలో మోడీ.. మోడీ నినాదాలు హోరెత్తిన సభ..
ఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ 2 సర్కారు ఏర్పడిన అనంతరం తొలిసారి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైంది. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారంతో మొదటి రోజు సభ షురువైంది. తొలుత ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ మోడీతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రమాణ స్పీకారం చేస్తున్న సమయంలో లోక్‌సభ మోడీ మోడీ నినాదాలతో దద్దరిల్లింది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కొడికున్నిల్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా వరుసగా ప్రమాణం చేశారు.
సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగనుంది. కేంద్ర మంత్రులు, ప్యానెల్ ఛైర్మన్ల అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఏపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల్లో పలువురు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ రేసులో మేనకాగాంధీ, రాధా మోహన్ సింగ్, అహ్లూవాలియా, జువెల్ ఓరామ్ పేర్లు వినిపిస్తున్నాయి.

అంతకు ముందు బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications