PARLIAMENT TODAY : లోక్ సభ ముందుకు రెండు బిల్లులు- నాగాలాండ్ ఘటనపైన ప్రకటనకు ఛాన్స్..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజున లోక్ సభ ముందుకు రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సభ ప్రారంగం కాగానే ప్రశోత్తరాలు జరగనున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే ఆదివారం నాగాలాండ్ లో చోటు చేసుకున్న ఘటన పైన ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంది. భద్రతా దళాల ఆపరేషన్ గురి తప్పి... 14 మంది సాధారణ ప్రజలపైన కాల్పులతో వారు మరణించారు. దీంతో ఆగ్రహంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో..తిరిగి వారి పైన జరిగిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన పైన ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం కోసం డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ పార్లమెంట్ వేదికగా జరిగిన పరిణామాల పైన ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, ఈ రోజు సమావేశాల్లో భాగంగా.. పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పేపర్లను సమర్పించనున్నారు. అదే విధంగా విదేశీ వ్యవహారాల శాఖ పైన ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ సైతం తమ రిపోర్టును సభ ముందు ఉంచనుంది. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది.

ఆర్దిక శాఖ కు స్టాండింగ్ కమిటీ డిమాండ్స్.. గ్రాంట్స్ పైన చేసిన సిఫార్సుల పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. నార్కోటిక్ డ్రగ్స్ కు సంబంధించి చట్ట సవరణ చేస్తూ బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ సభలో ఓమిక్రాన్ కేసుల పెరుగుదల..ప్రస్తుత పరిస్థితి గురించి సభలో స్టేట్ మెంట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్లును సైతం మాండవీయ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Recommended Video
దీంతో పాటుగా కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న సుప్రీం కోర్టు..హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలకు సంబంధించిన సవరణ బిల్లును న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశ పెట్టి..ఆమోదం కోరనున్నారు. రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం పైన మరోసారి ప్రతిపక్ష నేత ఖర్గే విపక్ష నేతలతో మంతనాలు సాగించనున్నారు. సభ్యుల సస్పెన్షన్ విత్ డ్రా చేసుకోవాలని మరోసారి ఛైర్మన్ పైన ఒత్తిడి తెచ్చేందుకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications