నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకూ పార్లమెంటు శీతాకాల భేటీ-సీసీపీఏ సిఫార్సు
పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణరు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 23 వరకూ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతోంది.
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 మధ్య 19 పని దినాలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తీసుకోవాల్సిన కోవిడ్ జాగ్రత్తలతో పాటు ఇతర చర్యల కోసం వివిధ కమిటీలు త్వరలో సమావేశం కాబోతున్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల, ఉపఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రానికి కీలకం కానున్నాయి. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న యూపీ ఎన్నికలకు కేవలం మూడు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Recommended Video
పార్లమెంటు చివరి సారిగా జూలై 19 నుంచి ఆగస్టు 11 వరకూ సాగింది. అప్పట్లో విపక్షాలు పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటును తరచుగా స్తంభింపజేయడంతో కేంద్రం సమావేశాల్ని వాయిదా వేసుకుని వెళ్లిపోయింది. వాస్తవానికి కోవిడ్ తర్వాత పార్లమెంటు సమావేశాలకు పూర్తి స్దాయిలో సభ్యుల్ని అనుమతించడం లేదు. ఎన్నో ఆంక్షల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నా మంత్రులు, ఎంపీలకు కోవిడ్ సోకింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి నెమ్మదించడం, వివిధ కార్యకలాపాలు సాధారణ స్ధాయికి చేరడంతో కేంద్రం ఈ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications